UA-35385725-1 UA-35385725-1

కార్పొరేట్ మాల్స్ వద్దు – చిరు వ్యాపారులే ముద్దు

కార్పొరేట్ మాల్స్ వద్దు – చిరు వ్యాపారులే ముద్దు

న్యూస్‌తెలుగు/వనపర్తి : వనపర్తి ని నాశనం చేస్తున్న అదాని, అంబానీ లాంటి పెద్దల కార్పొరేట్ వ్యవస్థను బహిష్కరిద్దాం కదలిరండి మేధావులకు మ, యువకులకు అఖిలపక్ష ఐక్యవేదిక కోరారు. వనపర్తి పట్టణం , జిల్లా బాగుపడాలంటే చిరు వ్యాపారుని, వనపర్తి జిల్లా వ్యాపారులని కాపాడుకోవాల్సిన అవసరం మనందరిపైనా ఉందని, ప్రతి ఒక్కరూ సామాజిక స్పృహతో ఆలోచించి వనపర్తి లో పుట్టగొడుగుల్లా వెలుస్తున్న కార్పొరేట్ వ్యవస్థను తరిమికొట్టాలని మీ అందరి తరపున అఖిలపక్ష ఐక్యవేదిక పిలుపునిస్తున్నది. ఇది ఏ ఒక్కరి కోసం కాదు వనపర్తి జిల్లా బాగు కోసమేనని ఇలాగే కార్పొరేట్ వ్యవస్థ ఇతర రాష్ట్రాల వ్యాపార వ్యవస్థ కొనసాగితే మన అన్నదమ్ముల్లా మనమధ్య ఉండే చిరు వ్యాపారులు నష్టపోయి వ్యాపారాలు లేక వీదిన పడతారు. మిగతా వ్యవస్థలపై భారం పడి వనపర్తి నాశనం అవుతుందని దీన్ని గమనించి మేధావులు యువకులు మహిళలు మిగతా అన్ని వర్గాలు ఈ కార్పొరేట్ వ్యవస్థ ను మరియు ఇతర రాష్ట్రాల వ్యక్తులచే నడిపే వ్యాపారాలను దూరం చేసి వనపర్తిని కాపాడుదాంఅని అన్నారు . రాబోవు రోజుల్లో మీ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లి ప్రతి ఒక్కరికి అర్థం చేయించేలా పైకి వేదిక పాటుపడుతుందని సతీష్ యాదవ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షులు సతీష్ యాదవ్ కాంగ్రెస్ నాయకులు వెంకటేష్, టిడిపి రాష్ట్ర నాయకులు కొత్త గొల్ల శంకర్, బీసీ నాయకులు గౌనికాడి యాదయ్య, సీనియర్ నాయకులు బొడ్డుపల్లి సతీష్, బి. ఎస్. పి టౌన్ ప్రెసిడెంట్ గంధం భరత్, శివకుమార్, రాములు, రమేష్, తదితరులు పాల్గొన్నారు. (Story : కార్పొరేట్ మాల్స్ వద్దు – చిరు వ్యాపారులే ముద్దు)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
UA-35385725-1