UA-35385725-1 UA-35385725-1

వరి ధాన్యం కొనుగోలు చేసేటప్పుడు ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం ఇవ్వకూడదు

వరి ధాన్యం కొనుగోలు చేసేటప్పుడు ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం ఇవ్వకూడదు

న్యూస్ తెలుగు/ వనపర్తి : వరి ధాన్యం కొనుగోలు చేసేటప్పుడు ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం ఇవ్వకూడదని అదనపు కలెక్టర్ రెవెన్యూ వెంకటేశ్వర్లు ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాల ఇంచార్జులకు మరోసారి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు చేసేటప్పుడు ఎఫ్ఏక్యూ నిబంధనలు పాటించాలని, గతంలో చేసిన పొరపాట్లను పునరావృతం చేయకూడదని ఆదేశించారు. కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా టార్పాలిన్లు, టెంట్లు ఏర్పాటు చేయాలన్నారు. సన్నాలకు, దొడ్డు వడ్లకు వేర్వేరు కేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. ప్రతి పీపీసీ దగ్గర అన్ని వివరాలతో బ్యానర్ ఏర్పాటు చేయాలన్నారు. బుధవారానికి అన్ని పీపీసీ లను ప్రారంభించాలని ఆదేశించారు. సన్నాలకు, దొడ్డు వడ్ల బస్తాలపై ప్రత్యేకమైన మార్కింగ్ ఉంటుందని అది పక్కాగా వేయాలన్నారు. ప్రతి చిన్న సమాచారాన్ని, ఎప్పటికప్పుడు వెబ్సైటు లో ఎంట్రీ చేయాలని సూచించారు. రైతులు వడ్లు పీపీసీ కి తెచ్చిన తర్వాత టోకెన్స్ ఇచ్చి వాటి ఆధారంగా బరువు కొలిచేందుకు చర్యలు తీసుకోవలన్నారు. రైతులు నష్టపోకుండా వారికి అన్ని విషయాలు సమగ్రంగా గైడ్ చేయాలని సూచించారు. సన్నాలకి తేమ శాతం 14 మించకూడదని, పక్కాగా చెక్ చేయాలని చెప్పారు. ధాన్యాన్ని కొనుగోలు చేసిన తర్వాత టాబ్ ఎంట్రీ చేసి, ట్రక్ షీట్ పూర్తి చేయడంతో పాటు, ఒపీఎంఎస్ లో ఎంట్రీ చేయాలన్నారు. ఎక్కడైనా పీపీసీ లలో సరిగ్గా నిబంధనలు పాటించకపోతే చర్యలు తీసుకోవడం జరుగుతుందనీ హెచ్చరించారు. అదేవిధంగా కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది అని కంప్లైంట్స్ రాకుండా జాగ్రత్త పడాలని సూచించారు. సమావేశంలో డిఆర్డిఓ పీడీ ఉమాదేవి, పౌర సరఫరాల శాఖ డిఎం ఇర్ఫాన్, సివిల్ సప్లై అధికారి విశ్వనాధ్, ఏపీఎం లు, ఐకేపీ కేంద్రాల ఇంచార్జిలు, తదితరులు పాల్గొన్నారు. (Story :వరి ధాన్యం కొనుగోలు చేసేటప్పుడు ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం ఇవ్వకూడదు)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
UA-35385725-1