పెన్షన్ కోసం పడిగాపులు కాస్తున్న వితంతు మహిళ
ఆదుకోవాలని బాధితురాలు ఆవేదన
న్యూస్ తెలుగు /ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : మండల పరిధిలోని మల్కాపురం గ్రామానికి చెందిన నారాయణమ్మ అనే వృద్ధురాలు (వితంతురాలు) పెన్షన్ కోసం పడిగాపులు కాస్తూ పెన్షన్ ఇప్పించండి అని అధికారుల చుట్టూ తిరిగినా కూడా ఫలితం లేకుండా పోయింది. బాధితురాలు నారాయణమ్మ మాట్లాడుతూ సంబంధిత సచివాలయంలో పెన్షన్ కు సంబంధించిన అన్ని నకలు ధ్రువపత్రాలతో సమర్పించినప్పటికీ తనకు పెన్షన్ మంజూరు కాలేదని బాధను వ్యక్తం చేసింది. సచివాలయాల చుట్టూ, ఎంపీడీవో ఆఫీస్ చుట్టూ తిరిగినా కూడా ఫలితం లేదని వాపోయింది. నా భర్త చనిపోయిన కూడా వితంతు పెన్షన్ కూడా ఎందుకు రాలేదో నాకే అర్థం కాలేదని ఆమె తెలిపింది. నాకన్నా వెనుక ఉన్నవారికి చాలామంది వితంతువులకు వచ్చిందని, నామీద అధికారులకు ఎందుకు ఇంత కక్ష ద్వారాని అవలంబిస్తున్నారో అర్థం కాలేదని ఆమె వాపోయింది. ఇప్పటికైనా నాకు సంబంధిత అధికారులు స్పందించి వితంతు పెన్షన్ ఇప్పించాలని ఆమె కోరుతున్నది. (Story : పెన్షన్ కోసం పడిగాపులు కాస్తున్న వితంతు మహిళ)