గర్భిణీ స్త్రీలు ఆరోగ్యం పట్ల తప్పనిసరిగా శ్రద్ధ కనబరచాలి : డాక్టర్. కార్తిక
న్యూస్ తెలుగు/ ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : గర్భిణీ స్త్రీలు ఆరోగ్యం పట్ల తప్పనిసరిగా శ్రద్ధను కనపరచాలని ఇన్ఫర్టీ లిటి స్పెషలిస్ట్- డాక్టర్ కార్తీక పేర్కొన్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని ఎర్రగుంట సర్కిల్ పోలీస్ చెక్ పోస్ట్ దగ్గర గల వీణవ్ క్లినిక్ అండ్ ల్యాబ్ నందు ఉచిత ఫెర్టిలిటీ చెకప్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా క్లినిక్ ప్రొప్రైటర్ సుమా మాట్లాడుతూ గర్భిణీ స్త్రీల యొక్క ఆరోగ్యం కొరకు ముఖ్యంగా పేద మహిళల కోసం మొట్టమొదటిగా మా క్లినిక్ నందు ఏర్పాటు చేయడం మాకెంతో సంతోషాన్ని ఇచ్చిందని తెలిపారు. 101 మంది గర్భిణీలకు ఫెర్టిలిటీ చెకప్ ను చేయడం జరిగిందని తెలిపారు. అవసరమైన వారికి మందులు కూడా ఉచితంగా పంపిణీ చేయడం జరిగిందన్నారు. మున్ముందు మరిన్ని ఉచిత వైద్య సేవ కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. అనంతరం డాక్టర్ కార్తిక మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలు గర్భం దాల్చినప్పటి నుండి డెలివరీ అయ్యేదాకా ఆరోగ్యమును జాగ్రత్తగా చూసుకోవాలని, కుటుంబ సభ్యులు కూడా ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని తెలిపారు. గర్భిణీ స్త్రీలు ఎటువంటి టెన్షన్లకు గురికాకూడదని, పౌష్టిక ఆహారాన్ని ఎప్పటికప్పుడు తీసుకోవాలని, డాక్టర్ యొక్క సలహాలు తప్పనిసరిగా పాటిస్తూ నెలవారి టీకాలు కూడా వేయించుకోవాలని తెలిపారు. అప్పుడే సుఖవంతమైన ప్రసవం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో హేమంతు, ప్రోగ్రాం ఆర్గనైజింగ్- హరీష్, గర్భిణీ స్త్రీలు పాల్గొన్నారు. (Story : గర్భిణీ స్త్రీలు ఆరోగ్యం పట్ల తప్పనిసరిగా శ్రద్ధ కనబరచాలి : డాక్టర్. కార్తిక)