సమాజ పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ నడుము బిగించాలి
ప్రాంతా బౌద్ధిక్ ప్రముఖ కొండపల్లి రామారావు
న్యూస్ తెలుగు /ధర్మవరం (శ్రీ సత్యసాయి జిల్లా) : సమాజం పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు నడుము బిగించాలని ప్రాంత బౌద్దిక్ ప్రముక్ కొండపల్లి రామారావు, రిటైర్డ్ ఆర్మీ హానరబుల్ లెఫ్ట్నెంట్ ఆర్. శ్రీధర్ తెలిపారు. ఈ సందర్భంగా ధర్మవరం పట్టణంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆధ్వర్యంలో ఆర్ఎస్ఎస్ ఏర్పడిన సంవత్సరంలో పడిన సందర్భంగా పట్టణంలో పురవీధులలో ఆదివారం పద సంచాలన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలుత పథ సంచలన్మార్గం పట్టణంలోని కళాజ్యోతి సర్కిల్, ఆర్టీసీ బస్టాండ్, పిఆర్టి సర్కిల్, గాంధీ సర్కిల్, తేరు బజార్, అంజుమాన్ సర్కిల్ ద్వారా కళాజ్యోతికి చేరుకోవడం జరిగింది. పద సంచలనలో (రూట్ మార్చ్) పూలవర్షం కురిపిస్తూ, ఆర్ఎస్ఎస్ ఘోష్ (బ్యాండ్) గీతముతో ముందుకు సాగారు. ఈ పద సంచలనం ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంది. పోలీసులు వారు కూడా ఈ కార్యక్రమం విజయవంతం అయ్యేంతవరకు తమ సహాయ సహకారాలను అందించారు. అనంతరం శ్రీధర్, కొండపల్లి రామారావు మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ ఏర్పడి నూరు సంవత్సరాలు ఏర్పడిన సందర్భంగా ఈ శత జయంతి ఉత్సవాలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయని తెలిపారు. దేశం, సమాజం కోసం, సామరస్య పూర్వకంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని తెలిపారు. సమాజంలో మంచి పరివర్తన తీసుకొని రావాలని కుటుంబ విలువలు పెంచాలని సామాజిక సమరసత సాధించాలని తెలిపారు. హిందూ ధర్మాన్ని ప్రతి ఒక్కరూ పాటించాలని తెలిపారు. మన దేశ హిందూ ధర్మమే ప్రపంచానికి స్ఫూర్తిని ఇస్తోందని తెలిపారు. గ్రామీణ వికాసం,గో
ఆధారిత వ్యవసాయం చేపట్టాలని, స్వాబిలంబన కూడా సాధించాలని తెలిపారు. ఈ రూట్ మార్చ్ కార్యక్రమంలో వందలాదిమంది ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు పాల్గొన్నారు. (Story : సమాజ పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ నడుము బిగించాలి)