విద్యార్థులకు నోట్ పుస్తకాలు పెన్నులు పంపిణీ
న్యూస్‌తెలుగు/వినుకొండ:- తమ తల్లిదండ్రులు కీర్తిశేషులు గొంట్ల వెంకమ్మ,రంగయ్య ల జ్ఞాపకార్థం వారి మెమోరియల్ ట్రస్ట్ తరఫున స్థానిక 15వ వార్డు ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థులందరికి నోట్ పుస్తకాలు మరియు పెన్నులను వారి కుమారుడు జన విజ్ఞాన వేదిక అధ్యక్షులు జి కమలారామ్ అందజేశారు. తల్లిదండ్రులు మనకు ప్రత్యక్ష దైవాలని వారిని స్మరించుకుంటూ గత 18 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం నియోజకవర్గంలోని ఒక్కో పాఠశాలకు ఉచితంగా నోటు పుస్తకాలు పెన్నులు పలకలు తదితర విద్యార్థులకు అవసరమైన వస్తువులను అందజేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కమలారామ్ దంపతులతో పాటుగా ఎల్ ఎఫ్ ఎల్ హెచ్ ఎం ప్రసాద్, ఉపాధ్యాయులు నాగరాజు, కోటేశ్వరరావు, రమాదేవి, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. (Story : విద్యార్థులకు నోట్ పుస్తకాలు పెన్నులు పంపిణీ)