Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సవ ఏర్పాట్లు పరిశీలన కమిషనర్‌

పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సవ ఏర్పాట్లు పరిశీలన కమిషనర్‌

పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సవ ఏర్పాట్లు పరిశీలన కమిషనర్‌

న్యూస్‌ తెలుగు/విజయవాడ : నగరంలో ఘనంగా జరిగనున్న పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సవ వేడుకల ఏర్పాట్లును నగరపాలక సంస్థ కమిషనర్‌ ధ్యానచంద్ర శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక అక్టోబర్‌ 21వ తేదీన స్థానిక ఇందిరాగాంధీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ స్టేడియం పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సవ వేడుకులు ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ వేడుకలకు అవసరమైన పార్కింగ్‌, గ్రౌండ్‌ ఏర్పాట్లు, పెరేడ్‌ మార్కింగ్‌ ట్రాక్స్‌, త్రాగునీటి సరఫరా, తాత్కాలిక మరుగుదొడ్లు, పారిశుధ్య నిర్వహణ తదితర ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. వేడుకలకు ఎలాంటి అంతరాయం కలగకుండా పగడ్బందీ ఏర్పాట్లు చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. వేడుకలు పక్కకు జరగాలని ఆదేశించారు. ఈ పర్యటనలో అడిషనల్‌ కమిషనర్‌ చంద్రశేఖర్‌, ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ చంద్రశేఖర్‌, ఇన్‌చార్జి సీఎంఓహెచ్‌ డాక్టర్‌ సురేష్‌ బాబు, ఇంజనీరింగ్‌, శానిటేషన్‌ సిబ్బంది పాల్గొన్నారు. (Story : పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సవ ఏర్పాట్లు పరిశీలన కమిషనర్‌)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!