ప్రభుత్వ చౌక ధాన్యపు స్టాక్ పాయింట్ ను పరిశీలించిన ఆర్డిఓ మహేష్.
న్యూస్ తెలుగు/ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : పట్టణంలోని మార్కెట్ యార్డులోగా ప్రభుత్వ చౌక ధాన్యపు స్టాక్ పాయింట్ ను (ఎంఎల్ఎస్) ఆర్డిఓ మహేష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గోడౌన్లో ఉన్న స్టాకు రిజిస్టర్ లో ఉన్న స్టాక్ వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి, కరెక్టుగా ఉందని వారు తెలిపారు. అదేవిధంగా గోడౌన్లో ఉన్న బ్యాగులను కూడా తూకం వేసి పరిశీలించారు. జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు తనిఖీ నిర్వహించామని వారు తెలిపారు. ఎక్కడా ఎటువంటి పొరపాటు లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అక్కడి అధికారులకు వారు సూచించారు. ఈ కార్యక్రమంలో సి ఎస్ డి టి లక్ష్మీదేవి, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.(Story:ప్రభుత్వ చౌక ధాన్యపు స్టాక్ పాయింట్ ను పరిశీలించిన ఆర్డిఓ మహేష్.)