రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖా మంత్రివర్యులు శ్రీ సత్య కుమార్ యాదవ్ రెండు రోజుల పర్యటన.. ఎన్డీఏ కార్యాలయం ప్రకటన.
న్యూస్ తెలుగు/ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ ఈనెల 19, 20వ తేదీలలో రెండు రోజులపాటు ధర్మవరం నియోజకవర్గంలో పర్యటిస్తున్నట్లు ఎన్డీఏ కార్యాలయ వారు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
అక్టోబర్ 19 శనివారం:-ఉదయం 9:00 గంటలకు ధర్మవరం నియోజకవర్గంలోని బత్తలపల్లి మండలం మాల్యవంతం గ్రామంలో ఎస్సీ బీసీ కాలనీ నందు కొత్త CC రోడ్లకు శంకుస్థాపన,
09:30 నిమిషాలకు మాల్యవంత గ్రామంలో నిర్వహించిన “పల్లె పండుగ – పంచాయతీ వారోత్సవాలు” కార్యక్రమం,10:00 గంటలుకు మాల్యవంతం నుండి అనంతపురం కు బయలుదేరి అనంతపురంలో జడ్పీ లో 1030-2:00 గంటల వరకు జిల్లా పరిషత్ సమావేశం కార్యక్రమం,మధ్యాహ్నం 2:30 నిమిషాలకు అనంతపురం అనంతపురం నుండి బయలుదేరి 3:00 గంటలు ధర్మవరం చేరుకొని 3:00 గంటల నుండి 4:00 గంటల వరకు ఎన్డీఏ కార్యాలయంలో నిర్వహించిన బిజెపి సభ్యత్వం డ్రైవ్‌పై సమీక్ష సమావేశంలో పాల్గొంటారు అని తెలిపారు. తదుపరి సాయంత్రం 4:00 గంటల నుండి 5:30 నిమిషాల వరకు ధర్మవరం రాఘవేంద్ర కల్యాణ మండపం నందు హ్యాండ్లూమ్ & పవర్‌లూమ్ మర్చంట్ అసోసియేషన్ ద్వారా నిర్వహించిన సత్కారం కార్యక్రమంలో పాల్గొంటారు అని తెలిపారు. తదుపరి అక్టోబర్ 20వ తేదీన ఆదివారం ఉదయం 10:00 గంటలకు నియోజకవర్గంలోని ముదిగుబ్బ పట్టణంలో టీచర్స్ కాలనీ నందు నిర్వహించిన “పల్లె పండుగ – పంచాయతీ వారోత్సవాలు” ,10:30 గంటలకు ముదిగుబ్బ పట్టణంలో టీచర్స్ కాలనీ నందు కొత్తగా వేయు CC రోడ్డుకు శంకుస్థాపన కార్యక్రమం,11:00 గంటలకు ముదిగుబ్బ పట్టణం కాకతీయ రెస్టారెంట్ ఎదురుగా ఎంపీపీ ఆది చే కొత్తగా ఏర్పాటు చేసిన బీజేపీ కార్యాలయం ప్రారంభోత్సవం కార్యక్రమంలో పాల్గొంటారు. తదుపరి11:30 నిమిషాలకు ముదిగుబ్బ నుండి బయలుదేరి12:00 గంటలుకు నియోజకవర్గ పరిధిలోని తాడిమర్రి మండలం ఏకపాదం పల్లిలో 12:15 నిమిషాలకు మామిడి మొక్కల పెంపకం కార్యక్రమం,మధ్యాహ్నం 12:25 నిమిషాలకు ఏకపాదం పల్లి గ్రామం కొత్తగా వేయు సిసి రోడ్డు ప్రారంభోత్సవం కార్యక్రమం, మధ్యాహ్నం 12:40 నిమిషాలకు ఏకపాదం పల్లి గ్రామం రచ్చ కట్ట నందు నిర్వహించిన “పల్లె పండుగ – పంచాయితీ వారోత్సవాలు” కార్యక్రమంలో పాల్గొంటారు అని తెలిపారు. తదుపరి మధ్యాహ్నం 2;30గంటలకు తాడిమర్రి నుండి బయలుదేరి ధర్మవరం నియోజకవర్గంలోని గొట్లూరు గ్రామం 3:00 గంటలకు చేరుకుని, అక్కడ గొట్లూరులో ఎస్ డబ్ల్యూ పిసి షెడ్ ప్రారంభోత్సవం కార్యక్రమం, తదుపరి3:50 నిమిషాలకు గొట్లూరు గ్రామంలో సిసిరోడ్‌కు శంకుస్థాపన కార్యక్రమం, సాయంత్రం4:00 గంటలకు గొట్లూరు గ్రామ సచివాలయం నందు “పల్లె పండుగ – పంచాయతీ వారోత్సవాలు” కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. కావున ఆయా మండల ప్రజలు, అధికారులు, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని వారు తెలిపారు.
(Story:రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖా మంత్రివర్యులు శ్రీ సత్య కుమార్ యాదవ్ రెండు రోజుల పర్యటన.. ఎన్డీఏ కార్యాలయం ప్రకటన.)