ప్రజావాణి దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి
న్యూస్‌తెలుగు/ వనపర్తి : ప్రజావాణి దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ ఆదేశించారు. సోమవారం ఐ.డి. ఓ.సి ప్రజావాణి హాల్లో అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ సంచిత్ గంగ్వార్ ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ వెంకటేశ్వర్లు, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి ఉమాదేవి తో కలిసి ప్రజావాణి ఫిర్యాదులు స్వీకరించారు. మొత్తం 87 ఫిర్యాదులు వచ్చాయి. అనంతరం అదనపు కలక్టర్ మాట్లాడుతూ అధికారులు ప్రజావాణి ద్వారా వచ్చిన దరఖాస్తులను పరిష్కరించటం పై నిర్లక్ష్యం వహించారాదని, ఎప్పటికప్పుడు పరిష్కరించి ఫిర్యాదు దారునికి సమాచారం ఇవ్వాలని సూచించారు. (Story : ప్రజావాణి దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి)