Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌వరదలతో ప్రజా జీవితం అతలాకుతలం

వరదలతో ప్రజా జీవితం అతలాకుతలం

వరదలతో ప్రజా జీవితం అతలాకుతలం

ముంపుపై ప్రభుత్వానికి సమగ్ర నివేదిక

ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిన ప్రభుత్వానికి కమిషన్‌ ధన్యవాదాలు

రాష్ట్ర ఎస్టీ కమిషన్‌ ఛైర్మన్‌ డా.డీవీజీ శంకరరావు

న్యూస్‌ తెలుగు/విజయవాడ : ఇటీవల కురిసిన భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు విజయవాడతో పాటు పరిసర ప్రాంతాల్లో ప్రజల జీవితాలను అస్తవ్యస్తం చేశాయని, ఎస్టీల జీవనోపాదిని భాగా దెబ్బతీశాయని, వాస్తవ పరిస్థితిపై ప్రభుత్వానికి సమగ్ర నివేదిక అందజేయనున్నట్లు రాష్ట్ర ఎస్టీ కమిషన్‌ ఛైర్మన్‌ డా.డీవీజీ శంకరరావు తెలిపారు. రాష్ట్ర ఎస్టీ కమిషన్‌ ఛైర్మన్‌ డా.డీవీజీ శంకరరావు, ఎస్టీ కమిషన్‌ సభ్యులు పడిత్యా శంకర్‌నాయక్‌తో కలిసి బుధవారం విజయవాడలోని న్యూఆర్‌ఆర్‌పేట, వాంబే కాలనీ, జక్కంపూడి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. వదల వల్ల ఆదివాసీలు ఎదుక్కొన్న ఇబ్బందులు, వరద వల్ల ఎదురైన కష్టాల నుంచి బాదితులకు గట్టెక్కించేందుకు ప్రభుత్వం నుంచి అందిన సహాయ సహకారాలపై అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అభివృద్దిలో వెనుకబడ్డ ఆదివాసీలకు వరద మరిన్ని కష్టాలను తెచ్చిందన్నారు. వరద కష్టనష్టాలను తెలుసుకుని ప్రభుత్వానికి సమగ్ర నివేదిక ఇచ్చేందుకు క్షేత్ర స్థాయిలో పర్యటిస్తున్నట్లు తెలిపారు. పూసలు అమ్ముకుంటూ, ఆటోలు నడపుకుంటూ చాలా చిన్న వ్యాపారాలు చేసుకుంటూ జీవిస్తున్న ఎస్టీలు వరదల వల్ల వారికి జీవనోపాది చాలా ఇబ్బందిగా మారిందన్నారు. ముడి సరుకు నీటిపాలై అర్ధిక సమస్యఉ తలెత్తాయని, ప్రభుత్వంతో పాటు స్వచ్చంద సంస్థలు బాదితులను ఆదుకునేందుకు కృషి చేస్తున్నాయని, బాదితులకు జరిగిన నష్టాన్ని ఎన్యూమరేషన్‌ ద్వారా ప్యాకేజీ ప్రకటించిన ప్రభుత్వానికి దన్యవాదాలు తెలిపారు.
ప్రభుత్వ పథకాలు అన్నీ అందేలా కృషి
వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి ఎస్టీలతో మాట్లాడటం జరిగిందని, ఆధార్‌, రేషన్‌ కార్డులు, పెన్షన్‌ వంటివిలేని కొందరు తమ సమస్యలను కమిషన్‌ దృష్టికి తీసుకువచ్చారన్నారు. ఈ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి అందరికీ న్యాయం జరిగేలా ప్రజా సంక్షేమం, కేమానికి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలన్నీ అందేలా కృషి చేయనున్నట్లు తెలిపారు. ఈ పర్యటనలో ఎస్టీ కమిషన్‌ రాష్ట్ర కార్యదర్శి రామశేషు, ఏవో విజయ్‌కుమార్‌, నేషనల్‌ ట్రైబల్‌ ఫెడరేషన్‌, అధ్యక్షులు నవీన్‌, జిల్లా గిరిజన సంక్షేమాధికారి జునీత, యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రయ్య, ఎస్టీ సంక్షేమ సంఘం నాయకులు ఉదయ్‌కుమార్‌, విజయవాడ నార్త్‌, రూరల్‌ తహసీల్దార్‌లు శిరీషాదేవి, సుగుణ పాల్గొన్నారు. (Story : వరదలతో ప్రజా జీవితం అతలాకుతలం )

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!