వేడుకలను ఘనంగా నిర్వహించాలి
జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే
న్యూస్‌తెలుగు/కొమురం భీం/ ఆసిఫాబాద్ జిల్లా : జిల్లాలో ఈ నెల 17వ తేదీన తెలంగాణ పాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించి వేడుకలను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. అదనపు కలెక్టర్ దీపక్ తివారి, సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్ల, జిల్లా రెవెన్యూ అధికారి లోకేశ్వర్ రావు లతో కలిసి జిల్లా అధికారులతో పాలనా దినోత్సవ వేడుకల నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ పాలన దినోత్సవ వేడుకలను జిల్లాలో విజయవంతం చేయాలని అన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి వేడుకలు విజయవంతం చేయాలని తెలిపారు. (Story : వేడుకలను ఘనంగా నిర్వహించాలి )