రాగి వేణు మృతి అత్యంత బాధాకరం
న్యూస్ తెలుగు/వనపర్తి : వనపర్తి పట్టణం 1వ వార్డుకు చెందిన రాగివేణు మృతి చెందడం అత్యంత బాధాకరమైన విషయమని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే రాగివేణు మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. విలువైన కుటుంబానికి తానెల్లప్పుడు అండదండగా ఉంటానని, మృతి చెందిన వ్యక్తిని తీసుకురాలేమని, మనోధైర్యం పాటించాలని ఎమ్మెల్యే కుటుంబ సభ్యులను ఓదార్చారు.కార్యక్రమంలో వనపర్తి మార్కెట్ యార్డ్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, వనపర్తి మున్సిపల్ వైస్ చైర్మన్ మధుసూదన్ గౌడ్, స్థానిక కౌన్సిలర్ జయశ్రీ చుక్కరాజు, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వాకిటి ఆదిత్య, pcc సభ్యులు శంకర్ ప్రసాద్, నాయకులు ఎస్ ఎల్ ఎన్ రమేష్, లక్కాకుల సతీష్, స్థానిక కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.(Story : రాగి వేణు మృతి అత్యంత బాధాకరం )
