Home వార్తలు తెలంగాణ బీసీల శకం ప్రారంభమైంది

బీసీల శకం ప్రారంభమైంది

0

బీసీల శకం ప్రారంభమైంది

ఐక్య ఉద్యమాలు నిర్వహించడమే లక్ష్యంగా ముందుకు సాగుతాం

బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధనుంజయ నాయుడు వెల్లడి

న్యూస్ తెలుగు/వనపర్తి : ప్రస్తుత దశలో అస్తిత్వ ఉద్యమాలు దేశవ్యాప్తంగా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతంగా కొనసాగుతున్నాయని ఇది ఎంతో ఆహ్వానించదగ్గ పరిణామం అని బీసీ హక్కుల సాధన సమితి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధూళిపాళ ధనుంజయ నాయుడు అన్నారు. సోమవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని సిపిఐ కార్యాలయంలో జరిగిన బీసీ హక్కుల సాధన సమితి జిల్లా స్థాయి ముఖ్యుల సమావేశానికి హాజరైన ఆయన మాట్లాడుతూ.కేంద్ర ప్రభుత్వం త్వరలో చేపట్టనున్న జన గణనలో కులగణన ను చేపట్టి ఏ కులం జనాభా ఎంత ఉందో లెక్కలు తీసి అదేవిధంగా జనాభా దామాషా పద్ధతిలో రాజకీయ ఆర్థిక రిజర్వేషన్లు కేటాయించాలని దామాషా ప్రకారం బడ్జెట్లో నిధులు కేటాయించాలని చట్టసభల్లో కూడా జనాభా దామాషా పద్ధతిలో సీట్లు కేటాయించి అన్ని కులాల వారికి చట్టసభల్లో ప్రాతినిధ్యం లభించే విధంగా చర్యలు చేపట్టాలని దేశంలో 3500 కులాలు ఉంటే ఈనాటికీ మూడువేల 400 కులాలు పార్లమెంటు గడప తొక్క లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రివర్గంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ కేటాయించాలని ఏకాభిప్రాయ సాధన పేరుతో గత 11 సంవత్సరాలుగా కుల గణన చేపట్టకుండా కేంద్ర ప్రభుత్వం మోకా లడ్డుతోందని, ఇప్పుడు గాని కుల ఘనంగా చేపట్టకపోతే బీసీలు మరో 10 సంవత్సరాలు పాటు వెనక్కి నెట్టివేయబడతారని అందుకొరకు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని బీసీ సంఘాలను ఐక్యం చేసి ఐక్య ఉద్యమాలు నిర్మించేందుకు వ్యూహరచన చేస్తున్నట్టు ఆయన తెలిపారు వనపర్తి జిల్లా సిపిఐ కార్యదర్శి కే విజయ రాములు మాట్లాడుతూ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో ఇచ్చిన ఇరవై ఒక్క హామీలను అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావాలని బీసీలను ఓట్లు వేసే యంత్రాలుగా మాత్రమే చూడరాదని, బీసీల అభివృద్ధి కొరకు సంవత్సరానికి 20 వేల కోట్ల రూపాయలు కేటాయిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించి ఉన్నారని ఇప్పటికీ శాసనసభలో మూడు బడ్జెట్లు ప్రవేశపెట్టారని కేవలం 11 వేల కోట్లు మాత్రమే కేటాయించారని మిగతా 50 వేల రూపాయలు బీసీల అభివృద్ధి కొరకు కేటాయించి అట్టి నిధులను ఖర్చు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సమావేశానికి జె రమేష్ అధ్యక్షత వహించగా కే లక్ష్మీనారాయణ, కృష్ణ, మైబూస్, కుమార్, గోపాలకృష్ణ, నరేష్, వంశీ, లక్ష్మణ్, శిరీష, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.(Story : బీసీల శకం ప్రారంభమైంది )

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version