Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ వినుకొండలో ఇళ్ల స్థలాల పోరాటంలో పాల్గొనబోతున్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి జి ఈశ్వరయ్య

వినుకొండలో ఇళ్ల స్థలాల పోరాటంలో పాల్గొనబోతున్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి జి ఈశ్వరయ్య

0

వినుకొండలో ఇళ్ల స్థలాల పోరాటంలో పాల్గొనబోతున్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి జి ఈశ్వరయ్య

సిపిఐ రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా వినుకొండలో మార్చి 24న ఇళ్ల స్థలాలు ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయల సాధన కొరకు ధర్నా

మారుతి వరప్రసాద్ సిపిఐ పల్నాడు జిల్లా కార్యదర్శి.

న్యూస్ తెలుగు/వినుకొండ : పట్టణాల్లో రెండు సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు ఇళ్ళ స్థలాల కోసం ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయల సాధన కోసం టిడ్ కో గృహాలను లబ్ధిదారులకు వెంటనే పంపిణీ చేయాలని తదితర డిమాండ్ల సాధన కోసం మార్చి 24న జరగనున్న ఆందోళన లను జయప్రదం చేయాలని సిపిఐ పల్నాడు జిల్లా కార్యదర్శి మారుతి వరప్రసాద్, పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సోమవారం నాడు వినుకొండ పట్టణంలో ని శివయ్య భవన్లో జరిగిన పార్టీ ముఖ్యుల సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల హామీల లో భాగంగా పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు ఇంటి నిర్మాణానికి నాలుగు లక్షలు రూపాయలు ప్రజలకు పంపిణీ చేస్తామని ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలని అలాగే రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది టిడ్ కో గృహాలు 80, 90 శాతం పూర్తయి లబ్ధిదారులకు పంపిణీ కాకుండా ఉన్న నేప థ్యంలో వాటిని లబ్ధిదారులకు వెంటనే పంపిణీ చేయాలని ఇంకా అనేక ఇతర ప్రజా సమస్యల పరిష్కారం కోసం మార్చి 24వ తేదీన వినుకొండలో స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద జరగనున్న ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి బూదాల శ్రీనివాసరావు, పట్టణ కార్యదర్శి ఉలవలపూడి రాము, సిపిఐ నాయకులు రాయబారం వందనం, మహంకాళి సుబ్బారావు, షేక్ కిషోర్, చీరాల అంజయ్య షేక్ మస్తాన, దారివేముల, బాబు, తదితరులు పాల్గొన్నారు.(Story : వినుకొండలో ఇళ్ల స్థలాల పోరాటంలో పాల్గొనబోతున్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి జి ఈశ్వరయ్య )

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version