ఎమ్మెల్యే జీవి ని కలిసిన బీజేపీ ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు తిలక్
న్యూస్ తెలుగు/వినుకొండ : పల్నాడు జిల్లా బీజేపీ ఎస్టీ సెల్ అధ్యక్షుడిగా ఇటీవల నియమితులైన వినుకొండ పట్టణానికి చెందిన మేరాజోత్ బాలగంగాధర్ తిలక్, రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ మరియు వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు ఆయన పుష్పగుచ్ఛం అందించి, శాలువాతో సత్కరించి వినయపూర్వకంగా పలకరించారు. అనంతరం నూతన అధ్యక్షుడు తిలక్ నాయక్‌కు ఎమ్మెల్యే జీవి అభినందనలు తెలిపారు. ఆయనను పూలమాల, శాలువాతో ఘనంగా సన్మానించారు. కూటమి విజయానికి మరింతగా కృషి చేయాలని ఈ సందర్భంగా తిలక్‌ను ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ బీజేపీ నాయకులు గోళ్ళ మస్తాన్ రావు, సీనియర్ న్యాయవాది అప్పారావు, బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా కార్యదర్శి పత్తి మణికంఠ, బీజేపీ జిల్లా కార్యదర్శి కె. జనాబ్ తదితరులు పాల్గొన్నారు.(Story : ఎమ్మెల్యే జీవి ని కలిసిన బీజేపీ ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు తిలక్ )
