క్రీడాకారుడు అబ్దుల్లా ను అభినందించిన తెనాలి సిఐ సాంబశివరావు..
న్యూస్ తెలుగు/వినుకొండ : వినుకొండ పట్టణానికి చెందిన పరుగుల వీరుడు షేక్ అబ్దుల్లా జాతీయ,అంతర్జాతీయ పరుగు పోటీల్లో పాల్గొని పలు పతకాలు సాధించారు. త్వరలో బెంగళూరులో జరుగనున్న పోటీలకు హాజరవుతున్న అబ్దుల్లా,తెనాలి త్రీ టౌన్ సీఐ సాంబశివరావు, ఎస్సై కరిముల్లా లను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అబ్దుల్లాను అభినందించి ఆర్థిక చేయూత అందించారు. అనంతరం వారు మాట్లాడుతూ వినుకొండ లో సీఐ గా పని చేస్తున్న సమయంలో అబ్దుల్లా పరిచయమయ్యారని ఇటువంటి క్రీడాకారులని ప్రోత్సహిస్తేనే మట్టిలోని మాణిక్యాలు బయటికి వస్తాయన్నారు. అబ్దుల్లా భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి తల్లిదండ్రులకు, జన్మభూమికి మంచి పేరు తీసుకుని రావాలని ఆకాంక్షిస్తున్నానన్నారు.(Story : క్రీడాకారుడు అబ్దుల్లా ను అభినందించిన తెనాలి సిఐ సాంబశివరావు.. )
