Home వార్తలు తెలంగాణ జనహృదయనేత అమ్మపల్లి శీనన్నకు జనం కన్నీటి వీడ్కోలు

జనహృదయనేత అమ్మపల్లి శీనన్నకు జనం కన్నీటి వీడ్కోలు

0

జనహృదయనేత అమ్మపల్లి శీనన్నకు జనం కన్నీటి వీడ్కోలు

న్యూస్ తెలుగు/వ‌న‌ప‌ర్తి : అమ్మపల్లి శ్రీనివాస్ రెడ్డి మృతితో అభిమానులు,స్నేహితులు,శ్రేయోభిలాషులు దుఃఖ సాగరములో మునిగిపోయారు. ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు తపన పడిన తమ అభిమాన నాయకుణ్ణికి కడసారి వీడ్కోలు పలకడానికి అశేషంగా తరలివచ్చిన వారితో అమ్మపల్లి జనసంద్రం అయ్యింది. భావోద్వేగానికి గురైన మాజీ మంత్రి పార్థీవ దేహానికి నివాళులు అర్పిస్తూ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి కన్నీటిపర్యంతమై తీవ్ర భావోద్వేగానికి గురైనారు. శ్రీనివాస్ రెడ్డి గారి పార్థీవ దేహానికి నివాళులు అర్పించి పాడే మోసి కడసారి వీడ్కోలు పలికారు. శ్రీనివాస్ రెడ్డి మృతి వ్యక్తిగతంగా తనకు,ప్రజలకు,పార్టీకి తీరని లోటని భగవంతుడు ఆయన ఆత్మకు శాంతి కలిగించి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని కల్పించాలని ఆకాంక్షించారు. నివాళులు అర్పించిన వారిలో మాజీ ఎం.ఎల్.ఏ అల.వెంకటేశ్వర రెడ్డి,గట్టు యాదవ్, వాకిటి శ్రీధర్, పలుస రమేష్ గౌడ్ నందిమల్ల అశోక్,జగదీశ్వర్ రెడ్డి, లక్ష్మా రెడ్డి,రఘుపతి రెడ్డి,రాజమహేంద్ర రెడ్డి,వేణు యాదవ్,బాలేశ్వేర్ రెడ్డి,కుమార్ యాదవ్,శ్రీనివాస్ గౌడ్,సేనాపతి,పురుషోత్తం రెడ్డి,చిట్యాల.రాము తదితరులు ఉన్నారు.(Story : జనహృదయనేత అమ్మపల్లి శీనన్నకు జనం కన్నీటి వీడ్కోలు )

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version