Home వార్తలు తెలంగాణ సిపిఐ జాతీయ కార్యదర్శిని కలిసిన వనపర్తి జిల్లా నేతలు.. పార్టీ పరిస్థితిపై ఆరా

సిపిఐ జాతీయ కార్యదర్శిని కలిసిన వనపర్తి జిల్లా నేతలు.. పార్టీ పరిస్థితిపై ఆరా

0

సిపిఐ జాతీయ కార్యదర్శిని కలిసిన వనపర్తి జిల్లా నేతలు.. పార్టీ పరిస్థితిపై ఆరా

న్యూస్ తెలుగు/వనపర్తి : సిపిఐ జాతీయ కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే రామకృష్ణను వనపర్తి సిపిఐ జిల్లా నేతలు కలిశారు. గోపాల్పేట మండల కేంద్రంలో ఈనాడు విలేఖరి జయచంద్రుని తల్లి అనసూయమ్మ ఇటీవల ఆకస్మికంగా గుండెపోటుతో మరణించగా, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా నేతలు గోపాల్పేటలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వనపర్తి జిల్లాలో పార్టీ పరిస్థితి, సర్పంచ్, మున్సిపల్ ఎన్నికల్లో సిపిఐ పోటీ ఫలితాలు తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రజా సమస్యలపై పోరాటం ద్వారా పార్టీని విస్తరించి పటిష్టం చేయాలని సూచించారు. సిపిఐ జిల్లా కార్యదర్శి విజయరాములు, నియోజకవర్గ కార్యదర్శి రమేష్, జిల్లా ఎన్ ఎఫ్ ఐ డబ్ల్యూ గౌరవ అధ్యక్షురాలు, మాజీ సర్పంచ్ కళావతమ్మ, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు శ్రీహరి, సిపిఐ వనపర్తి పట్టణ సహాయ కార్యదర్శి గోపాలకృష్ణ, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు నరేష్, డి హెచ్ పి ఎస్ జిల్లా సహాయ కార్యదర్శి శేఖర్, ఏఐఎస్ఎఫ్ డివిజన్ కార్యదర్శి వంశీ తదితరులు పాల్గొన్నారు.(Story : సిపిఐ జాతీయ కార్యదర్శిని కలిసిన వనపర్తి జిల్లా నేతలు.. పార్టీ పరిస్థితిపై ఆరా )

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version