Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ వైయస్సార్ ను ఆరాధిస్తూ, జగన్మోహన్ రెడ్డికి అండగా నిలుస్తున్న ముస్లిం, క్రైస్తవ, గిరిజన కుటుంబాలు

వైయస్సార్ ను ఆరాధిస్తూ, జగన్మోహన్ రెడ్డికి అండగా నిలుస్తున్న ముస్లిం, క్రైస్తవ, గిరిజన కుటుంబాలు

0

వైయస్సార్ ను ఆరాధిస్తూ, జగన్మోహన్ రెడ్డికి అండగా నిలుస్తున్న ముస్లిం, క్రైస్తవ, గిరిజన కుటుంబాలు

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ జెండాను ఎగురవేసిన వైసీపీ నేతలు….

న్యూస్ తెలుగు/వనపర్తి : వైయస్సార్సీపి 16వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించుకున్నారు. వైసిపి కార్యాలయ ఆవరణలో వైసీపీ నేతలు పార్టీ జెండాను ఆవిష్కరించి. కార్యాలయంలో దివంగత వైయస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అలాగే పట్టణంలో ఉన్న వైఎస్సార్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించి. పలు ప్రాంతాలలో ఆహారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఏ. అంజిరెడ్డి, సీనియర్ న్యాయవాది, జిల్లా అధికార ప్రతినిధి ఎంఎన్. ప్రసాద్, రాష్ట్ర పంచాయతీరాజ్ కార్యదర్శి పగడాల వెంకటరామిరెడ్డి, బొల్లాపల్లి ఎంపీపీ బి గురవయ్య, నూజెండ్ల ఎంపీపీ జయరామిరెడ్డి, ఈపూరు జడ్పిటిసి చౌడయ్య, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ గంధం బాలిరెడ్డి, గిరిజన తెగ నాయకులు గోవింద నాయక్ మాట్లాడుతూ. వైసిపి కష్టాల నుండి పుట్టిన పార్టీ అని, అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉండేందుకు ఆనాడు కేంద్ర కాంగ్రెస్ నాయకత్వాన్ని ఎదిరించి పెట్టిన పార్టీ వైసీపీ అని అన్నారు. వైయస్సార్ సంక్షేమ పథకాలన్నీ జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో అమలు చేస్తూ ముందుకు సాగారన్నారు. మరల ఎన్నికల్లో 40% ఓట్లు సాధించుకున్న వైసిపి అన్ని వర్గాల ప్రజల్లో నిలిచిపోయిందన్నారు. కాగా కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేస్తున్నప్పటికీ, వైసిపి నాయకులు కార్యకర్తలు ఎటువంటి ఆందోళన పడకుండా మంచి రోజులు కోసం వేచి చూస్తున్నారని అన్నారు. కాగా ఆనాడు వైయస్సార్ పాలనను దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు అనుసరిస్తూ వైయస్సార్ వైపు చూశాయన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రజలను చైతన్య పరచి, ఆర్థికంగా బలపడేందుకు వైయస్సార్ ఎంతో కృషి చేశారన్నారు. ఇక 15 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి పై కేసులు పెడుతూనే ఉన్నారని, ఏమన్నా ఆధారాలు చూపారా అని వారు ప్రశ్నించారు. ఇక ముస్లిం మైనారిటీలు, ఎస్సీ, ఎస్టీ, క్రైస్తవ, గిరిజన తెగలన్నీ వైయస్సార్ ను ఆరాధిస్తూ, మరోపక్క జగన్మోహన్ రెడ్డికి అండగా నిలుస్తున్నారని అన్నారు. వైసిపి హయాంలో ప్రభుత్వ పాలన ప్రజల వద్దకే వచ్చిందని, సచివాలయాల వ్యవస్థ, వార్డు వాలంటీర్ల వ్యవస్థ వల్ల లక్ష 20 వేల ఉద్యోగాల కల్పన జరిగి ప్రజలు ఇళ్ల వద్దనే ఉండి సంక్షేమ పథకాలు అందుకున్నారన్నారు. మాయ మహమ్మారి కరోనా కాలంలో వార్డు వాలంటీర్లు చేసిన వైద్య సమాచారం మరువలేనిది అన్నారు. అలాగే ఇంగ్లీషు బోధన విద్యారంగంలో పలు మార్పులు తెచ్చిన ఘనత వైసీపీ దే అన్నారు. ఇక రాజకీయ పదవులు ప్రభుత్వ రిజర్వేషన్లే కాకుండా, ప్రైవేట్ రిజర్వేషన్లు కూడా కల్పించడం వల్ల అందరికీ సమాన రాజకీయ పదవులు లభించాయన్నారు. ఇక కూటమి ప్రభుత్వంలో సూపర్ సిక్స్ పథకంలో కొన్ని అలాగే మిగిలిపోయాయి అన్నారు. నిరుద్యోగ భృతి లేదు, కూటమి హామీలన్నీ అమలు కావటం లేదన్నారు. బొల్లా బ్రహ్మనాయుడు ఒక్క సారి పాలనలో ఎన్ని అభివృద్ధి మార్కులు ఉన్నాయో ప్రజలే చెబుతున్నారని వారన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కే శివ, ఆర్ శీను, జయరాజ్, బాలిరెడ్డి, వెంకటరెడ్డి, దండు చెన్నయ్య, బి గురవయ్య, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.(Story : వైయస్సార్ ను ఆరాధిస్తూ, జగన్మోహన్ రెడ్డికి అండగా నిలుస్తున్న ముస్లిం, క్రైస్తవ, గిరిజన కుటుంబాలు )

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version