హర్ష స్కూల్‌లో స్వచ్ఛ సర్వేక్షణ్ అవగాహన సదస్సు
న్యూస్ తెలుగు/వినుకొండ : స్థానిక తిమ్మాయపాలెం రోడ్‌లోని హర్ష స్కూల్‌లో విద్యార్థులకు స్వచ్ఛ సర్వేక్షణ్ 2025-26పై మున్సిపల్ కమిషనర్ కె. శివరాం ప్రసాద్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే జి.వి. ఆంజనేయులు, కలెక్టర్ కృతికా శుక్లా, మున్సిపల్ చైర్ పర్సన్ షేక్ దస్తగిరి ఆదేశాల మేరకు ఈ సదస్సు జరిగింది.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. తడి, పొడి, హానికర వ్యర్థాలను వేరు చేయడం వల్ల కలిగే ప్రయోజనాలను, వర్మీ కంపోస్ట్ తయారీ విధానాన్ని విద్యార్థులకు వివరించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకంతో క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు వస్తాయని, వీటికి బదులుగా క్లాత్, జ్యూట్ బ్యాగులు లేదా స్టీల్ బాక్సులు వాడాలని సూచించారు. రోడ్లు, కాలువలు, ఖాళీ ప్రదేశాల్లో చెత్త వేయకుండా ‘విజువల్ క్లీన్ వినుకొండ’ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ ఇస్మాయిల్, స్కూల్ డైరెక్టర్ పోకూరి శ్రీనివాసరావు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.(Story : హర్ష స్కూల్‌లో స్వచ్ఛ సర్వేక్షణ్ అవగాహన సదస్సు )
