Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ చీఫ్ విప్ జీవీకి “ ఏ గ్రేడ్”

చీఫ్ విప్ జీవీకి “ ఏ గ్రేడ్”

0

చీఫ్ విప్ జీవీకి “ ఏ గ్రేడ్”

న్యూస్ తెలుగు/వినుకొండ  : వినుకొండ శాసన సభ్యులు, ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులుకు “ఏ” గ్రేడ్ దక్కింది. రాష్ట్రంలోని శాసన సభ్యుల పనితీరు ఆధారంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేల పనితీరుపై సర్వే చేయించి, వచ్చిన నివేదికల ఆధారంగా గ్రేడ్లు ఇస్తూ మార్గనిర్దేశనం చేస్తున్నారు. పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాల్లో చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ముందు వరుసలో నిలిచి “ఏ” గ్రేడ్ సాధించటం ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నుండి ప్రశంశలు అందుకున్నారు. రానున్న రోజుల్లో ప్రజలకు మరింత చేరువగా ఉంటూ వినుకొండను అభివృద్ధి చేయాలని తపిస్తున్న జీవి ఆంజనేయులుకు ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వినుకొండ పర్యటనకు రావటం, వెటర్నరీ కాలేజీ ఏర్పాటు చేస్తామని ప్రకటించటం మరింత ఊరటనిచ్చింది. ఇవేకాక ఇప్పటికే నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పూర్తి చేసేదిశగా చంద్రబాబు నాయుడు భరోసా నివ్వటంతోపాటు, వినుకొండ పట్టణంలో 21 ఎకరాల ఎన్.ఎస్.పి స్థలాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి, వినుకొండకే తలమానికంగా తీర్చిదిద్దేందుకు సుమారు రూ.50కోట్ల నుండి 100 కోట్ల వరకు నిధులు ఇచ్చేందుకు చంద్రబాబు నాయుడు అంగీకారం తెలిపారు. ఇప్పటికే నియోజకవర్గంలో 100 పేద కుటుంబాలను పీ4 ద్వారా దత్తత తీసుకున్న జీవీ ఆంజనేయులు దంపతులను సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా అభినందించారు. ప్రజాదర్బార్ ద్వారా ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న జీవి ఆంజనేయులు నియోజకవర్గ ప్రజలకు మరింత అందుబాటులో ఉంటూ, వారి సమస్యలు పరిష్కరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ నేపధ్యంలో జీవికి “ఏ” గ్రేడ్ దక్కటంపై కేడర్లో ఉత్సాహం రెట్టింప్పైంది.(Story : చీఫ్ విప్ జీవీకి “ ఏ గ్రేడ్” )

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version