వినుకొండ గ్లోబల్ మైండ్స్ స్కూల్‌లో ‘స్వచ్ఛ సర్వేక్షన్’ అవగాహన
న్యూస్ తెలుగు/వినుకొండ : పట్టణంలోని 19వ వార్డు గ్లోబల్ మైండ్స్ స్కూల్‌లో విద్యార్థులకు ‘స్వచ్ఛ సర్వేక్షన్ 2025-26’పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ కె. శివరాం ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సులో తడి, పొడి, హానికర చెత్తను వేరుచేసి ఇవ్వాలి. వంటింటి తడి చెత్తతో హోం కంపోస్ట్ తయారు చేసుకోవాలి. సింగిల్ యూస్ ప్లాస్టిక్ వాడకం మాని, క్లాత్ లేదా జూట్ బ్యాగులనే ఉపయోగించాలి. బహిరంగ మలమూత్ర విసర్జన నివారించి, పబ్లిక్ టాయిలెట్స్ వాడాలి అన్నారు. రోడ్లు, కాలువల్లో చెత్త వేయకుండా ‘విజువల్ క్లీన్ వినుకొండ’కు సహకరించాలి. వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ, స్వచ్ఛ సర్వేక్షన్ 2025-26లో పట్టణానికి ఉత్తమ ర్యాంక్ సాధించేందుకు అందరూ కృషి చేయాలి.ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్‌స్పెక్టర్ ఇస్మాయిల్, ఎస్ఏసీ కోఆర్డినేటర్ శివ పార్వతి, పాఠశాల డైరెక్టర్ సూర్యనారాయణ, ఉపాధ్యాయులు, విద్యార్థులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.(Story : వినుకొండ గ్లోబల్ మైండ్స్ స్కూల్‌లో ‘స్వచ్ఛ సర్వేక్షన్’ అవగాహన )
