శావల్యాపురంలో సీపీఐ ఆధ్వర్యంలో విరాళాల సేకరణ
న్యూస్ తెలుగు/వినుకొండ : వినుకొండ నియోజకవర్గం, శావల్యాపురం మండల కేంద్రంలో మంగళవారం సీపీఐ నాయకులు గడపగడపకూ తిరిగి కరపత్రాలు పంపిణీ చేస్తూ విరాళాలు సేకరించారు. సీపీఐ రాష్ట్ర సమితి పిలుపుమేరకు, వినుకొండ నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో ఈ విరాళాల సేకరణ కార్యక్రమం వరుసగా 10వ రోజు నిర్విఘ్నంగా కొనసాగింది. ఈ కార్యక్రమంలో సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి బూదాల శ్రీనివాసరావు, మండల కార్యదర్శి రాయబారం వందనం, వినుకొండ ఏరియా నాయకులు కొప్పరపు మల్లికార్జునరావు, దారి వేముల మరియ బాబు, షేక్ మస్తాన్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.(Story : శావల్యాపురంలో సీపీఐ ఆధ్వర్యంలో విరాళాల సేకరణ )
