ఎన్. ఎం. ఎం. ఎస్. పరీక్షలలో ఉత్తమ ప్రతిభ
న్యూస్ తెలుగు/వినుకొండ : జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ఎన్ఎస్పి కాలనీ, వినుకొండ మండలానికి చెందిన విద్యార్థులు కె హర్ష శ్రీ, హెచ్. రోనాల్డ్ జాతీయస్థాయి ప్రతిభా పరీక్షలలో ఎన్నికై స్కాలర్షిప్ పొందినట్టు పాఠశాల ప్రధానోపాధ్యాయులు సిహెచ్. వీరప్పయ్య తెలిపారు. ఉన్నతీకరణ చెందిన ఈ పాఠశాల మొదటి ప్రయత్నంలోనే ఇద్దరు విద్యార్థులు ఎన్నిక కావటం వెనుక సైన్స్ ఉపాధ్యాయులు బి గోవింద నాయక్ కృషి మరియు పాఠశాల అధ్యాపక సిబ్బంది ప్రోత్సాహం ఉందని ప్రధానోపాధ్యాయులు అభినందించారు. ఎంపికైన విద్యార్థులకు వరుసగా ఆరు సంవత్సరాల పాటు, సంవత్సరానికి 12 వేల రూపాయల నగదు బహుమతి అందుతుందని అది వారి విద్య కొనసాగింపు కు ప్రోత్సాహకరంగా ఉంటుందని తెలిపారు. ఎంపికైన విద్యార్థులను పాఠశాల సిబ్బంది అభినందించారు.(Story : ఎన్. ఎం. ఎం. ఎస్. పరీక్షలలో ఉత్తమ ప్రతిభ )
