Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్ బాయ్స్ హై స్కూల్ మంది విద్యార్ధులకు పరీక్ష సామాగ్రిని పంపిణి 

గవర్నమెంట్ బాయ్స్ హై స్కూల్ మంది విద్యార్ధులకు పరీక్ష సామాగ్రిని పంపిణి 

0

గవర్నమెంట్ బాయ్స్ హై స్కూల్ మంది విద్యార్ధులకు పరీక్ష సామాగ్రిని పంపిణి 

న్యూస్ తెలుగు/వినుకొండ :- స్థానిక గవర్నమెంట్ బాయ్స్ హై స్కూల్ నందు బుధవారం నాడు బెజవాడ చారిటబుల్ ట్రస్ట్ అధినేత బెజవాడ వెంకట నాగేశ్వరరావు ఆధ్వర్యంలో, నిత్య సేవాతత్పరులు గాండ్ల నాగేంద్రుడు, పరీక్ష సామాగ్రిని, మరియు నర్సరావుపేట కు చెందిన శ్రీవేద కోచింగ్ ఇనిస్ట్యూట్ అధినేత శ్రీ,చావా వెంకటేశ్వరరావు, ఎగ్జామ్ ప్యాడ్ లను 140 మంది విద్యార్ధులకు అందించడం జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన శ్రీ,బెజవాడ వెంకట నాగేశ్వరరావు, మాట్లాడుతూ. శ్రీవేద ఇనిస్ట్యూట్ అధినేత శ్రీ,చావా వెంకటేశ్వర రావు, తన కోచింగ్ సెంటర్లో నామమాత్రపు ఫీజుతో లాడ్జింగ్ అండ్ బోర్డింగ్ ఏర్పాటు చేస్తూ అత్యంత నైపుణ్యం కలిగిన అధ్యాపకులచే కోచింగ్ అందించి పాలిటెక్నిక్, ఇంజనీరింగ్ లలో వందల సీట్లను సాధింప చేశారు. ఈ విషయంలో చావా వెంకటేశ్వర రావు, అభినందనీయులు అని పలికారు. అలాగే మన పట్టణంలో అందరికి తెలిసిన వ్యక్తి, సహాయం అంటే ముందుండే మంచి మనిషి గాండ్ల నాగేంద్రుడు, వారు చేస్తున్నా ఎన్నో మహోన్నత కార్యక్రమాలు వారిని అద్భుతమైన వ్యక్తి గా, ఆయనను ప్రత్యేకంగా మారుస్తున్నాయని పలికి ఇరిద్దరూ ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలను మునుముందు చేస్తూ వారి జీవితాన్ని సాఫల్యం చేసుకోవాల్సిందిగా కోరుకున్నారు, అలాగే గౌరవ చీఫ్ విప్

శ్రీ, జి వి ఆంజనేయులు విద్య పట్ల,10 వ తరగతి విద్యార్థుల పట్ల తీసుకుంటున్న చర్యలు, కృషి గురించి తెలుపుతూ సింగపూర్ ట్రిప్, మరియు 5 లక్షల ప్రోత్సాహం గురించి విద్యార్థులకు మరొకమారు గుర్తుచేసి ఉత్సాహపరిచారు. ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి,డా :యశోద మాట్లాడుతూ. ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్న దాత, ను అభినందిస్తూ మా గవర్నమెంట్ బాయ్స్ హైస్కూల్ విద్యార్ధులకు ప్యాడ్ లను, పరీక్ష సామాగ్రిని అందజేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు, శ్రీ చావా వెంకటేశ్వర రావు, మాట్లాడుతూ విద్యార్ధులు నైతిక విలువలను పెంపొందించుకొని మంచి ఆలోచనతో వారి జీవితాన్ని ఆనందమయంగాను తీర్చిదిద్దుకోవాలని అది మీ చేతుల్లోనే ఉంటుందని హితవు పలికారు, పట్టణ రోటరీ క్లబ్ సెక్రటరీ జనాబ్, ఎస్ కే బాజీ, మాట్లాడుతూ ఈరోజుల్లో అనేకమంది విద్యార్ధులు సోషల్ మీడియాకు బానిసలుగా మారి వారి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారని సోషల్ మీడియాను అవసరం మేరకు వాడుకొని ముందుకు సాగాలని హితవు పలికారు. ఈ కార్యక్రమానికి హాజరైన రోటరీ క్లబ్ చైర్మన్ శ్రీ, ఆలా శ్రీనివాసరావు, మాట్లాడుతూ విద్యార్థులు ఇలాంటి కార్యక్రమాలను స్ఫూర్తిగా తీసుకొని రాబోయే భావి తరాలకు మీరు మార్గదర్శకులు కావాలని కోరుకున్నారు , రోటరీ క్లబ్ కోశాధికారి శ్రీ, పొత్తురి నవీన్, మాట్లాడుతూ 140 మంది విద్యార్ధులకు ప్యాడ్లను అందించిన వెంకటేశ్వరరావు, కి, పరీక్ష సామాగ్రి ని అందించిన గాండ్ల నాగేంద్రుడు, దీనికి సహాయ సహకారాలు అందించిన బెజవాడ వెంకట నాగేశ్వరరావు, బాజీ , చైర్మన్ ఆలా శ్రీనివాసరావు, గారికి, ,ఎస్ కే రసూల్, మాస్టర్ రాము, శుభాకాంక్షలు తెలుపుకుంటూ విద్యార్థులందరు ,మార్చిలో జరగబోయే పరీక్షలలో మంచి మార్కులను సాధించి పాఠశాలకు పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని పలికారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొని విజయవంతం చేశారు.విద్యార్థులు దాతలకు ప్రత్యేకంగా ధన్యవాదములు తెలిపారు. కార్యక్రమానికి హాజరైన పెద్దలందరు విద్యార్థులకు శుభాకాంక్షలు చెప్పి జీవితంలో అంతా మంచే జరగాలని మనస్ఫూర్తిగా దీవించారు.(Story : గవర్నమెంట్ బాయ్స్ హై స్కూల్ మంది విద్యార్ధులకు పరీక్ష సామాగ్రిని పంపిణి  )

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version