Home వార్తలు తెలంగాణ సామాజిక రుగ్మతలనుండి బంజారా జాతిని చైతన్యం చేసిన మహనీయుడు సంత్ సేవలాల్ మహరాజ్

సామాజిక రుగ్మతలనుండి బంజారా జాతిని చైతన్యం చేసిన మహనీయుడు సంత్ సేవలాల్ మహరాజ్

0

సామాజిక రుగ్మతలనుండి బంజారా జాతిని చైతన్యం చేసిన మహనీయుడు సంత్ సేవలాల్ మహరాజ్

న్యూస్ తెలుగు/వనపర్తి : బంజారాల ఆరాధ్య దైవం అయిన సంత్ సేవలాల్ 287వ జయంతి సందర్భంగా మాజీ మంత్రివర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి జిల్లా బంజారా భవన్ లో ఆయన చిత్రపటానికి పూలమాలలు సమర్పించి నివాళులు అర్పించారు. నిరంజన్ రెడ్డి కి బంజారా నాయకులు ఘనంగా స్వాగతం పలికి సంప్రదాయ దుస్తులు బహుకరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ సంత్ సేవలాల్ మహరాజ్ గారు బంజారాలను చైతన్యం చేసి అహింసనే ఆయుధంగా చైతన్యం చేశారని అన్నారు. బంజారాలకు స్థిర నివాసాలు ఏర్పాటు చేయించి సంసృతి సంప్రదాయాలను నేర్పించి సామాజిక రుగ్మతలనుండి దూరం చేసిన మహనీయుడు సంత్ సేవలాల్ మహరాజ్ గారు అని కొనియాడారు. బంజారా సోదరులకు ప్రత్యేక స్థలం కేటాయించి అద్భుతమైన భవనాన్ని నిర్మించామని రాబోవు కాలంలో బంజారా సోదరులకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. నిరంజన్ రెడ్డి వెంట జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్, దేవర్ల.నరసింహ,చిట్యాల.రాము మరియు చంద్రశేఖర్ నాయక్,జాతృ నాయక్,ధర్మా నాయక్,నారాయణ నాయక్, టీక్యా నాయక్,రాజ్ కుమార్ నాయక్,కౌన్సిలర్ బాబు శంకరమ్మనాయక్, జంప్ల నాయక్,భూచ్యా నాయక్ తదితరులు ఉన్నారు.(Story : సామాజిక రుగ్మతలనుండి బంజారా జాతిని చైతన్యం చేసిన మహనీయుడు సంత్ సేవలాల్ మహరాజ్)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version