Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ వినుకొండ ఆడపడుచు తెలంగాణలో మున్సిపాలిటీ చైర్మన్ గా ఎంపిక

వినుకొండ ఆడపడుచు తెలంగాణలో మున్సిపాలిటీ చైర్మన్ గా ఎంపిక

0

వినుకొండ ఆడపడుచు తెలంగాణలో మున్సిపాలిటీ చైర్మన్ గా ఎంపిక

న్యూస్ తెలుగు/వినుకొండ : ఇటీవల తెలంగాణ జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ నుండి ఖమ్మం జిల్లా వైరా మున్సిపల్ చైర్ పర్సన్ గా మన వినుకొండ ఆడబిడ్డ ఎన్నిక కావడం గర్వకారణం ఆంధ్ర బిడ్డ తెలంగాణ అడ్డాలో మున్సిపల్ చైర్మన్ గా జెండా ఎగరవేసింది అది అధికార పార్టీ చైర్మన్ కావడం మరో విశేషం వినుకొండ నియోజకవర్గం నూజెండ్ల మండలం గుర్రప్ప నాయుడుపాలెం గ్రామానికి చెందిన లగడపాటి చంద్రకళ వైరా మున్సిపాలిటీ చైర్ పర్సన్ గా ఎన్నికయ్యారు. లగడపాటి చంద్రకళ వృత్తి రీత్యా డాక్టర్ గా వైరాలో ప్రాక్టీస్ చేస్తున్నారు. గైనిక్ డాక్టర్ గా ఆ ప్రాంతంలో ప్రజల నాడి పట్టారు. ఆమె భర్త డాక్టర్ కాపా మురళీకృష్ణ కి మంచి పేరుంది. ఆ ప్రాంతంలో అనేక వార్డులను దత్తత తీసుకొని ప్రజల అభివృద్ధి కోసం మౌలిక సదుపాయాల కల్పన కోసం పేద మధ్యతరగతి వర్గాలకు ఉచిత వైద్యాన్ని అందిస్తూ ప్రజల అభిమానాన్ని సొరంగం చంద్రకళ మురళి కృష్ణ దంపతులు మున్సిపల్ ఎన్నికలలో విజయం కా మోగించారు. నూజెండ్ల మండలం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గంగవరపు చందారావు కు డాక్టర్ చంద్రకళ మేనకోడలు కావడం విశేషం, ఆమె విజయంతో నూజెండ్ల మండలం గుర్రప్ప నాయుడుపాలెం గ్రామంలో ఆమె బంధువులు అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.(Story : వినుకొండ ఆడపడుచు తెలంగాణలో మున్సిపాలిటీ చైర్మన్ గా ఎంపిక )

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version