ఘనంగా కెసిఆర్ జన్మదిన వేడుకలు
న్యూస్ తెలుగు/వనపర్తి : తెలంగాణ రాష్ట్ర సాధకులు మాజీ ముఖ్యమంత్రివర్యులు కె.సి.ఆర్ గారి 72వ జన్మదినాన్ని పట్టణ అధ్యక్షులు పలుస రమేష్ గౌడ్ ఆధ్వర్యములో ఘనంగా నిర్వహించబడ్డాయి. నిరంజన్ రెడ్డి గారి స్వగృహంలో కె.సి.ఆర్ గారి బర్త్ డే కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్ మాట్లాడుతూ కె.సి.ఆర్ పాలననే తెలంగాణకు శ్రీరామ రక్ష అని ప్రజలు భావిస్తున్నారని మళ్ళీ సారు రావాలి అని ప్రజలు భావిస్తున్నారని అని అన్నారు.తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి అభివృద్ధిలో అగ్రభాగాన కె.సి.ఆర్ గారు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ వారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమములో జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్,ప్రధాన కార్యదర్శి గంధం.పరంజ్యోతి కౌన్సిలర్స్ మురళీ సాగర్,శ్రీకర్ గౌడ్,మాజీ జెడ్.పి.టి.సి రఘుపతి రెడ్డి,జాతృ నాయక్,హేమంత్ ముదిరాజ్,సునీల్ వాల్మీకి,సయ్యద్.జమీల్,నందిమల్ల.రమేష్,సూర్యవంశం.గిరి,జె.శ్రీనివాసులు,జోహెబ్ హుస్సేన్,బండారు.కృష్ణ,డాక్టర్.డ్యానియల్, చిట్యాల.రాము,నీలస్వామిక్రాంతి కుమార్,మహేశ్వర్ రెడ్డి, వెంకట్ సాగర్, హారీఫ్,గంధం.వి విజయ్,వజ్రాల.సాయిబాబా,పార్థసారథి గౌడ్,లోకాజీ,ఖాదర్శ తదితరులు పాల్గొన్నారు.(Story : ఘనంగా కెసిఆర్ జన్మదిన వేడుకలు )

