అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన కలెక్టర్ కృతిక శుక్లా
ఫిబ్రవరి 21 న పట్టణంలో జరగనున్న స్వచ్ఛంద – స్వర్ణంద్రా కార్యక్రమంలో పాల్గొననున్న సిఎం చంద్రబాబు
న్యూస్ తెలుగు/వినుకొండ : ఈ నెల 21 న పట్టణంలో జరగనున్న స్వచ్చాంధ్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా జూనియర్ కళాశాల లోని హెలిప్యాడ్ స్థలాన్ని, ఎన్ ఎస్ పి కాలనీ గ్రౌండ్ లో జరగనున్న సభాస్థలి, ప్రభుత్వ వైద్యశాల లో జరగనున్న స్వచ్చాంధ్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమ పరిసరాలను పరిశీలించారు. అనంతరం వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ మధులత, డి సి హెచ్ ఎస్ ప్రసూన, డి.ఎస్.పి ఎం హనుమంతరావు, స్థానిక అధికారులు తహసిల్దార్ ఎం సురేష్ నాయక్, మున్సిపల్ కమిషనర్ శివరాం ప్రసాద్, డి ఎం హెచ్ ఓ రవి, పట్టణ సీఐ ప్రభాకర్, రెవెన్యూ, పోలిస్, ఆరోగ్య శాఖ, విద్యుత్, పురపాలక శాఖ అధికారులతో పాటు పలు శాఖల సిబ్బంది పాల్గొన్నారు.(Story : అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన కలెక్టర్ కృతిక శుక్లా )

