Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ మార్చి 31 లోగా రైతులు రుణాలు చెల్లించాలి

మార్చి 31 లోగా రైతులు రుణాలు చెల్లించాలి

0

మార్చి 31 లోగా రైతులు రుణాలు చెల్లించాలి

రైతులకు అతి తక్కువ వడ్డీకే రుణాలు

ప్రతి రైతుకు మూడు లక్షల వరకు రుణ సౌకర్యం

జీడిసిసి బ్యాంక్ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు వెల్లడి..

న్యూస్ తెలుగు/వినుకొండ: రైతులు తాము తీసుకున్న రుణాలను ఈ ఏడాది మార్చి 31వ తేదీలోగా బ్యాంకులకు తిరిగి చెల్లించాలని జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ మక్కెన మల్లికార్జున రావు విజ్ఞప్తి చేశారు. వినుకొండ పట్టణంలోని సొసైటీ బ్యాంకులో ఆయన విలేకరులతో మాట్లాడారు. వినుకొండ నియోజకవర్గంలో సొసైటీలు ద్వారా 11 వేలమంది రైతులకు క్రాప్, సీసీ, ఎల్డీ రుణాలు అందించినట్లు తెలిపారు. బ్యాంకుల ద్వారా 290 కోట్లు సొసైటీల ద్వారా, బ్యాంకుల నుంచి 180 కోట్లు వినుకొండ నియోజకవర్గం లో రుణాలు అందించినట్లు తెలిపారు. రైతులకు అతి తక్కువ వడ్డీకే రుణాలు ఇచ్చి ప్రోత్సహించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రతి రైతుకు మూడు లక్షల రూపాయల రుణాలు ఇవ్వడం జరుగుతుందని మొదటి లక్ష రూపాయలకు ఎటువంటి వడ్డీ చెల్లించాల్సిన అవసరం లేదని మక్కెన తెలిపారు. రైతులు జి డి సి సి బ్యాంకులో సొసైటీల ద్వారా రుణాలు సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా బలోపేతం కావాలని ఆయన పిలుపునిచ్చారు. సకాలంలో రుణాలు చెల్లించినట్లయితే వడ్డీ తక్కువగా రుణాలు పొందే అవకాశం ఉంటుందని తెలిపారు.(Story : మార్చి 31 లోగా రైతులు రుణాలు చెల్లించాలి )

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version