Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ బ్రహ్మనాయుడు దుష్ప్రచారం మానుకోవాలి 

బ్రహ్మనాయుడు దుష్ప్రచారం మానుకోవాలి 

0

బ్రహ్మనాయుడు దుష్ప్రచారం మానుకోవాలి 

న్యూస్ తెలుగు/వినుకొండ : మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు దుష్ప్రచారం చేయటం మానుకోవాలని జీడీసీసీ బ్యాంకు ఛైర్మన్ మక్కెన మల్లికార్జునరావు హితవుపలికారు. మంగళవారం స్థానిక చీఫ్ విప్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజకీయ స్వార్ధం కోసం అసత్యాలు ప్రచారం చేయటం మంచి పద్ధతి కాదన్నారు. కూటమి ప్రభుత్వం
సూపర్ సిక్స్ హామీలు అమలు చేసి, ప్రజలకు మంచి పాలన అందిస్తుందటే ప్రతిపక్ష పార్టీ
నాయకులకు అవి కనపడకపోవటం బాధాకరమన్నారు. వినుకొండ నియోజకవర్గంలో
ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు జరుగుతున్నాయని, చీఫ్ విప్ జీవి ఆంజనేయులు చొరవతో దశాబ్ధాల నుండి పరిష్కారం కాని ప్రజా సమస్యలు పరిష్కరిస్తున్నామన్నారు. అవగాహన లేకుండా విమర్శలు చేస్తున్న బొల్లా బ్రహ్మనాయుడు నిజాలు తెలుసుకోవాలని సూచించారు. జగనన్న కాలనీలో విద్యుత్ ట్రాన్సఫార్మర్లు తెచ్చి వినుకొండలో ఏర్పాటు చేయటం అన్నది పచ్చి అబద్ధమని, నాలుగు విధ్యుత్ ట్రాన్సఫార్మర్లలో మూడు గుంటూరు నుండి తీసుకురాగా,మరొకటి షిఫ్టింగ్ చేశామన్నారు. వేల్పూరులో కోల్డు స్టోరేజ్కి గత ఏడాది నుండి 24 గంటల కరెంటు ఇస్తుంటే కరెంటు లేదని ప్రచారం చేయటం ఏమిటని మక్కెన నిలదీశారు. పింఛన్లు పెంపు, ఉచిత బస్సు, తల్లికి వందనం వంటి పథకాలతోపాటు పోలవరం, అమరావతి నిర్మాణానికి వేలకోట్లు ఖర్చుపెడుతున్న కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం కోసం కృషి చేస్తుందన్నారు. లడ్డు కల్తీలో శ్రీ వేంకటేశ్వరస్వామి కూటమి నాయకులకు  బుద్ధి చెప్పటం కాదని, లడ్డు కల్తీకి పాల్పడిన వైసీపీకి ఇప్పటికే వేంకటేశ్వరస్వామి ఘోరమైన శిక్ష విధించినా వైసీపీ నాయకులకు బుద్ధి రాలేదని ధ్వజమెత్తారు. నెయ్యిలో పామాయిల్ తదితర ఆయిల్స్ కలిశాయని అప్పటి టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి, మాజీ మంత్రి రోజా ఇటీవల అన్న మాటలు మీకు వినపడలేదా అని మక్కెన ప్రశ్నించారు. హిందువుల మనోభావాలు కాపాడటం కోసం కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. తిరుమల లడ్డు కల్తీని నిగ్గుతేల్చి తిరుమల ప్రక్షాళన చేసి స్వామివారి ఔన్నత్యాన్ని కాపాడతామన్నారు. సిబిఐ, సిట్ రిపోర్టు ప్రకారం నెయ్యిలో కల్తీ జరగలేదని వైసీపీ నిరూపించగలదా? అని ప్రశ్నించారు. అపనిందలు వేయాల్సిన అవసరం కూటమి ప్రభుత్వానికి లేదు…అపచారం చేసిన వైసీపీకే ఆ అవసరం వచ్చిందిదని చెప్పారు. ఘర్షణలు, గొడవలు సృష్టించి శాంతి భద్రతలకు భంగం కలుగజేసైనా రాజకీయ ఉనికి కోసం వైసీపీ ప్రయత్నిస్తుందని దుయ్యబట్టారు.
తొందరపాటు…పొరపాటు… అని ముఖ్యమంత్రిని ఇష్టాసారం మాట్లాడితే సహించేది లేదు…తప్పు ఎవరు చేసినా తప్పు కాకుండా పోదన్నారు. వినుకొండ పట్టణంలోని ఎన్ఎస్పీ స్థలాలను అభివృద్ధి చేసి పట్టణానికి తలమానికంగా మారుస్తామని స్పష్టం చేశారు. యూరియా కొరత లేదని, రైతులకు పంటలు బాగా పండాయని ప్రతిపక్షాలు పనిగట్టుకొని తప్పుకు ప్రచారం చేస్తుందన్నారు. ఈ సమావేశంలో పి. దాసయ్య, పత్తి పూర్ణ, బొంకూరి రోశయ్య, బచ్చు అంజిరెడ్డి, గడిపూడి విశ్వనాథం, తిరుమల శెట్టి బాలయ్య, పెసల వెంకటనారాయణ, సొసైటీ అధ్యక్షులు, క్లస్ట్ రు ఇన్చార్జులు.. తదితరులు పాల్గొన్నారు.(Story : బ్రహ్మనాయుడు దుష్ప్రచారం మానుకోవాలి  )

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version