Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ ఈ నెల 9న రైతు భోజన శాల ప్రారంభం..

ఈ నెల 9న రైతు భోజన శాల ప్రారంభం..

0

ఈ నెల 9న రైతు భోజన శాల ప్రారంభం..

కిసాన్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు తోట..

న్యూస్ తెలుగు/వినుకొండ : స్థానిక రైతు భవనంలో శనివారం పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అఖిల భారత కిసాన్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు తోట ఆంజనేయులు మాట్లాడుతూ. వినుకొండ పట్టణంలోని శివయ్య స్తూపం వెనుక ఎండిఓ ఆఫీస్ దగ్గరలో రైతు భవనాన్ని నిర్మించడం జరిగింది. ఇందులో రైతు భోజన శాల సోమవారం స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ చీప్ విప్ జీవి ఆంజనేయులు, వినుకొండ మున్సిపల్ చైర్ పర్సన్ డాక్టర్ దస్తగిరి, జిడిసిసిబి చైర్మన్ మక్కెన మల్లికార్జున రావు, మండల అధ్యక్షులు పగడాల వెంకటరామిరెడ్డి ప్రారంభిస్తారని, ఇంకా వైసీపీ, తెలుగుదేశం, జనసేన, సిపిఐ, సిపిఎం, రైతు సంఘం నాయకులు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొంటారు. కావున ఈ రైతు భోజనశాలను నియోజకవర్గంలోని పేద రైతులందరూ పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ నియోజకవర్గం సుధూరం మార్గం నుంచి గ్రామాల నుండి పట్టణానికి వచ్చి ఖరీదైన భోజనం తినలేక ప్రమాదకరమైన ఆహార పదార్థాలు తింటూ అర్థ ఆకలితో ఇంటికి వెళ్తున్న పరిస్థితి ఉంది, ఈ దేశానికి అన్నం పెట్టే రైతాంగానికి ఇలాంటి పరిస్థితి రాకూడదని రైతులకి ఆత్మగౌరవం దెబ్బ తినకూడదని రైతు సంఘం భావించి కేవలం 45 రూపాయలకే తిన్నంత రుచికరమైన భోజనం ప్రతిరోజు 12 గంటల నుంచి మూడు గంటల వరకు భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఉదయం ఇడ్లీ, దోశ, పొంగలి ఏదైనా 20 రూపాయలకి రైతు కూలీలకి పేదలకు రైతు భవనంలో రైతు భోజన శాల పేరుతో ఏర్పాటు చేయడం జరిగింది. కావున నియోజకవర్గం లోని రైతులు పేదలందరూ విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ పట్టణ కార్యదర్శి ఎస్కె ఫిరోజ్, కార్మిక సంఘం నాయకులు ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.(Story : ఈ నెల 9న రైతు భోజన శాల ప్రారంభం.. )

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version