విద్యార్థినిలకు పరీక్ష ప్యాడ్ లను అందజేసిన శ్రీ వేద కోచింగ్ ఇన్స్టిట్యూట్ యాజమాన్యం..
న్యూస్ తెలుగు/వినుకొండ : స్థానిక జడ్పీ బాలికోన్నత పాఠశాల నందు బెజవాడ చారిటబుల్ ట్రస్ట్ అధినేత బెజవాడ వెంకట నాగేశ్వరరావు ఆధ్వర్యంలో,ఎం టీ ఎస్ జిల్లా ప్రెసిడెంట్ బోడేపూడి శ్రీనివాసరావు సహాయ సహకారాలతో నర్సరావుపేట కు చెందిన శ్రీవేద కోచింగ్ ఇన్స్టిట్యూట్ అధినేత చావా వెంకటేశ్వరరావు 250 మంది విద్యార్థినీలకు ఎగ్జామ్ ప్యాడ్లను అందించడం జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన బెజవాడ వెంకట నాగేశ్వరరావు మాట్లాడుతూ. శ్రీవేద ఇనిస్ట్యూట్ అధినేత చావా వెంకటేశ్వర రావు ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ తన కోచింగ్ సెంటర్లో నామమాత్రపు ఫీజుతో లాడ్జింగ్ అండ్ బోర్డింగ్ ఏర్పాటు చేస్తూ అత్యంత నైపుణ్యం కలిగిన అధ్యాపకులచే కోచింగ్ అందించి పాలిటెక్నిక్ ఇంజనీరింగ్ లలో వందల సీట్లను సాధింప చేశారు. ఈ విషయంలో చావా వెంకటేశ్వర రావు కు అభినందనీయమని, ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలను మునుముందు చేస్తూ వారి జీవితాన్ని సాఫల్యం చేసుకోవాల్సిందిగా కోరారు. ప్రధానోపాధ్యాయురాలు బి శైలజ మాట్లాడుతూ. ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్న వెంకటేశ్వరరావు, బెజవాడ వెంకట నాగేశ్వరరావు ను అభినందిస్తూ మా గర్ల్స్ హైస్కూల్ ను ఎంచుకొని విద్యార్థినీలకు ప్యాడ్ లను అందజేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. చావా వెంకటేశ్వర రావు మాట్లాడుతూ. విద్యార్థినిలు నైతిక విలువలను పెంపొందించుకొని మంచి ఆలోచనతో వారి జీవితాన్ని ఆనందమయంగాను అందంగాను తీర్చిదిద్దుకోవాలని, అది మీ చేతుల్లోనే ఉంటుందని హితవు పలికారు. స్థానిక కౌన్సిలర్ రెడ్డి నాగ పద్మ మాట్లాడుతూ. ఈరోజుల్లో అనేకమంది విద్యార్థినీలు సోషల్ మీడియాకు బానిసలుగా మారి వారి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారని, సోషల్ మీడియాను అవసరం మేరకు వాడుకొని ముందుకు సాగాలని ఏదైనా అనుకోని సంఘటనలు జరిగితే ప్రధానోపాధ్యాయురాలు ద్వారా మాకు తెలియజేస్తే వాటిని అడ్డుకుంటామని విద్యార్థినులకు ధైర్యం చెప్పారు. చంద్రశేఖర్ మాట్లాడుతూ. 250 మంది విద్యార్థినీలకు ప్యాడ్లను అందించిన వెంకటేశ్వరరావు, సహాయ సహకారాలు అందించిన బెజవాడ వెంకట నాగేశ్వరరావు, బోడేపూడి శ్రీనివాసరావు, రెడ్డి నాగ పద్మ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. విద్యార్థినీలు ఇలాంటి కార్యక్రమాలను స్ఫూర్తిగా తీసుకొని మీరు కూడా ఇలాంటి కార్యక్రమాలను అలవర్చుకోవాలని, మార్చిలో జరగబోయే పరీక్షలలో మంచి మార్కులను సాధించి పాఠశాలకు పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎం టీ ఎస్ రఘు మాస్టర్, ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు, విద్యార్థినిలు పాల్గొన్నారు.(Story : విద్యార్థినిలకు పరీక్ష ప్యాడ్ లను అందజేసిన శ్రీ వేద కోచింగ్ ఇన్స్టిట్యూట్ యాజమాన్యం.. )
