అనాధ శవాలకు అంతక్రియలు..
న్యూస్ తెలుగు/వినుకొండ : ఆదర్శ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సభ్యులు శనివారం అనాధ శవాలకు అంతక్రియలు నిర్వహించి మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ నాయకులు పివి. సురేష్ బాబు, పువ్వాడ కృష్ణ లు మాట్లాడుతూ. వినుకొండ పట్టణంలోని ఏనుగుపాలెం రోడ్డు కాశీనాయన ఆశ్రమం వద్ద, వినుకొండ రైల్వే ట్రాక్పై గుర్తుతెలియని వ్యక్తిలు గత నాలుగు రోజుల క్రితం మృతి చెందారు. రైల్వే పోలీసులు, వినుకొండ పట్టణ పోలీసులు మృతదేహాలను వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి మార్చురీలో ఉంచి మృతుల ఆచూకీ ప్రయత్నించిన ఆచూకీ లభించలేదు. సమాచారం తెలుసుకున్న ఆదర్శ ఫౌండేషన్ సభ్యులు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని పోలీసుల అనుమతితో మృతదేహాలను సందర్శించి అనాధ శవాలను స్వయంగా స్మశానానికి తరలించి అంతక్రియలు చేసినట్లు వారు తెలిపారు. ఆదర్శ ఫౌండేషన్ సభ్యులు మానవతా దృక్పథంతో ఇప్పటికి అనేక అనాధ శవాలకు అంతక్రియలు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సభ్యులు అక్బర్ బాషా, మాలిక్ తదితరులు పాల్గొన్నారు.(Story : అనాధ శవాలకు అంతక్రియలు.. )
