Home వార్తలు తెలంగాణ అడుగు అడుగునా రావులకు అపూర్వ స్పందన

అడుగు అడుగునా రావులకు అపూర్వ స్పందన

0

అడుగు అడుగునా రావులకు అపూర్వ స్పందన

న్యూస్ తెలుగు/వనపర్తి : మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి మున్సిపల్ ఎన్నికల సందర్భంగా 6,12,22,23, వార్డులలో పర్యటించి బి.ఆర్.ఎస్ అభ్యర్థులు ఏర్వ.అరుణ,కవితా నాయక్,శ్రీకర్ గౌడ్,అలేఖ్య,యధమ్మల తరపున విస్తృతంగా పర్యటించి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రజలు రావులకు అపూర్వస్వాగతం పలికి గత అనుభవాలను రావుల చేసిన అభివృద్ధిని గుర్తుచేసుకున్నారు. మెట్టుపల్లి6వార్డులో పెద్ద మనుషులు రావుల చంద్రశేఖరరెడ్డికి తమ గ్రామానికి చేసిన సేవలను గుర్తుచేసి భావోద్వేగానికి గురైనారు. రావుల చంద్రశేఖరరెడ్డి ఆత్మీయంగా పలకరించి యోగక్షేమాలు అడిగి తెలుసుకొన్నారు. నిరంజన్ రెడ్డి గారి అభివృద్ధిని ఆదరించాలని రావుల చంద్రశేఖరరెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.మా హయాములో మౌలిక వసతులు కల్పిస్తే శాశ్వత అభివృద్ధి పనులను నిరంజన్ రెడ్డి సాధించిపెట్టినారని మరోసారి బి.ఆర్.ఎస్ అభ్యర్థులను గెలిపిస్తే నేను నిరంజన్ రెడ్డి కలసి అభివృద్ధిని కొనసాగిస్తామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అలివికాని,అమలు కానీ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది మహిళలకు 2500,తులం బంగారం,ఆసరా పింఛన్లు 4000,రైతులకు రైతు భరోసా 15000,నిరుద్యోగులకు 2లక్షల ఉద్యోగాలు ఎగ్గొటిందని విమర్శించారు. కె.సి.ఆర్ సుపరిపాలన నిరంజనుడి ప్రజాపాలన కావాలంటే బి.ఆర్.ఎస్ పార్టీకి అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. రావుల వెంట నందిమల్ల.అశోక్,పి.రమేష్ గౌడ్,ఎం.డి.గౌస్,ముద్దుసార్,బాలు నాయుడు,వేణు రెడ్డి తదితరులు ఉన్నారు.(Story : అడుగు అడుగునా రావులకు అపూర్వ స్పందన)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version