Home వార్తలు తెలంగాణ ప్రజా ప్రభుత్వంతోనే పెబ్బేరు అభివృద్ధి

ప్రజా ప్రభుత్వంతోనే పెబ్బేరు అభివృద్ధి

0

ప్రజా ప్రభుత్వంతోనే పెబ్బేరు అభివృద్ధి

న్యూస్ తెలుగు/పెబ్బేరు: జరగబోయే మున్సిపాలిటీ ఎన్నికలలో పెబ్బేరు మున్సిపాలిటీలోని 12 వార్డులకు సంబంధించి 12 మంది కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే గెలుస్తారని దాంతో పెబ్బేరు మున్సిపల్ పై కాంగ్రెస్ జెండా ఎగరవేయడం ఖాయమని వనపర్తి శాసనసభ్యులు గౌరవ శ్రీ తూడి మేఘారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా శుక్రవారం పెబ్బేరు పట్టణంలోని
ఆరవ వార్డు ఏడు వార్డు ఎనిమిది వార్డు తొమ్మిది వార్డ్ పది వార్డ్ పదకొండు వార్డ్ 12వ వార్డువార్డ్
వార్డులలో ఆయన ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆరో వార్డు అభ్యర్థి T.కృష్ణయ్య , ఏడో వార్డ్ అభ్యర్థి శివన్న, ఎనిమిది వార్డు అభ్యర్థి T. సత్యనారాయణ , తొమ్మిది వార్డు అభ్యర్థి అక్కి శ్రీనివాస్ గౌడ్ గారిని, పది వార్డు అభ్యర్థి M. బాలరాజు గారిని, పదకొండు వార్డ్ అభ్యర్థి పర్వీనా బేగం గారిని, 12వ వార్డు అభ్యర్థి కే. లక్ష్మి గారిని అఖండ మెజారిటీతో గెలిపించాలని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు శివసేన రెడ్డి గారు, మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ రావు తో కలిసి అభ్యర్థుల తరఫున ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెబ్బేరు పట్టణంలోని 30 ఎకరాల సంత స్థలాన్ని కబ్జా చేసి విలువైన భూమిని సొంతం చేసుకోవాలని చూసిన ఓ మాజీ మంత్రి నేడు పెబ్బేరు పట్టణంలో BRS పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ ప్రచారం చేయడం సిగ్గుచేటుని ఆయన అన్నారు. పెబ్బేరు పట్టణంలో పదేళ్ల టిఆర్ఎస్ పార్టీ నాయకులు చేసిందేమీ లేదని ఇందిరమ్మ రాజ్యం రేవంత్ రెడ్డి సర్కార్ అధికారంలోకి వచ్చాక కేవలం రెండు సంవత్సరాల లోనే పెబ్బేరు మునిసిపాలిటీలో కేవలం పెబ్బేరు మున్సిపాలిటీలోనే 54 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేపట్టినట్లు వారు పేర్కొన్నారు. పెబ్బేరు పట్టణంలోని మున్సిపాలిటీలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు రేషన్ కార్డులు ఉచిత విద్యుత్తు సన్న బియ్యం పంపిణీ మహిళలకు వడ్డీ లేని రుణాలు, RTC లో ఉచిత ప్రయాణం లాంటి అనేక సంక్షేమ పథకాలు నేడు ఇంటింటికి అందుతున్నాయని అన్నారు.అవినీతిపరుల మోసపూరిత మాటలు నమ్మకుండా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపించుకుంటేనే పెబ్బేరు మున్సిపాలిటీ పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందుతుందని వారు సూచించారు. కార్యక్రమంలో పెబ్బేరు మార్కెట్ యార్డ్ అధ్యక్షురాలు ప్రమోదిని రెడ్డి, ఉపాధ్యక్షుడు విజయవర్ధన్ రెడ్డి, పెబ్బేరు పట్టణ మాజీ అధ్యక్షులు వెంకట్రాములు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, జిల్లా కాంగ్రెస్ మహిళా సమాఖ్య అధ్యక్షురాలు శ్రీలత, రంజిత్ కుమార్, దయాకర్ రెడ్డి, గంధం రాజశేఖర్, సురేందర్ గౌడ్, రామచంద్ర రెడ్డి, సాయిచరణ్ రెడ్డి, మణిగిల్ల తిరుపతిరెడ్డి, యుగేందర్ రెడ్డి, యాపర్ల రాంరెడ్డి, గుమ్మడం వెంకటరామిరెడ్డి, శ్రీహరి రాజు, రాజశేఖర్ రెడ్డి, పట్టణ మాజీ కౌన్సిలర్, మహిళలు,యువకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్దలు పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.(Story : ప్రజా ప్రభుత్వంతోనే పెబ్బేరు అభివృద్ధి )

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version