క్యాటరింగ్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఏర్పాటు
న్యూస్ తెలుగు/వినుకొండ : వినుకొండ నియోజకవర్గం క్యాటరింగ్ అసోసియేషన్ కార్యక్రమాన్ని శుక్రవారం గంగినేని ఫంక్షన్ హాల్ నందు స్టేట్ ఫౌండర్ వ్యవస్థాపక అధ్యక్షులు గట్టా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ప్రమాణస్వీకారం మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వినుకొండ క్యాటరింగ్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు జాజుల మాల్యాద్రి, షేక్ సైదా అధ్యక్షత వహించగా, వినకొండ పట్టణ పుర ప్రముఖులందరూ ఎన్నికైన నూతన కమిటీకి అభినందనలు తెలిపారు. ప్రెసిడెంట్ సుబ్బారావు, సెక్రటరీగా మాడిశెట్టి అంకారావు, జాయింట్ సెక్రటరీ ఇమ్మడిశెట్టి వెంకట సుబ్బారావు, వ్యాఖ్యా నాయక్, వైస్ ప్రెసిడెంట్ దేసు నాగరాజు, గోపాల నాగరాజు, ట్రెజరర్ మాగులూరి సుబ్బారావు, కార్యవర్గ సభ్యులు ఇమ్మడిశెట్టి బాబురావు, లాకారావు, భాష, అచ్యుత నాగేశ్వరరావు ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి స్టేట్ ఫౌండర్ గట్ట శ్రీనివాస్ రావు మాట్లాడుతూ. క్యాటరింగ్ అనేది ప్రతి ఇంట్లో అత్యవసరమైన సాధనంగా మారిందని, ప్రజలందరికీ న్యాయమైన, విలువైన సమయానుకూలంగా అన్ని కార్యక్రమాలకి చేసేటటువంటి రంగాల్లో మొదటి రంగాంగా ఉన్నదని, ఇటువంటి కార్యక్రమాన్ని వినుకొండలో మొట్టమొదటిసారి చేయడం ఎంతో అభినందనీయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని క్యాటరింగ్ చెందిన అన్ని విభాగాలు పాల్గొన్నాయి.(Story : క్యాటరింగ్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఏర్పాటు )
