విశ్రాంత ఉద్యోగుల సేవా సంఘం ఆధ్వర్యంలో అన్నదానం..
న్యూస్ తెలుగు/వినుకొండ : పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల సేవా సంఘం కార్యాలయ ఆవరణలో శుక్రవారం కీర్తిశేషులు పులుపుల పద్మావతి జ్ఞాపకార్థం భర్త పులుపుల సీత రామాంజనేయులు సహకారంతో 97వ అన్నదాన కార్యక్రమాన్ని వారి చేతుల మీదుగా నిర్వహించారు. అనంతరం సంఘ కార్యక్రమాల గురించి భువనగిరి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ. దాతల సహకారంతో నిర్విరామంగా ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, అదేవిధంగా సంఘ సభ్యులు సహకారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అవ్వారు కోటేశ్వరరావు, వై వి సుబ్బయ్య శర్మ, గోపి, రామలింగేశ్వరరావు, ఎం వి శర్మ, జి నాగేంద్రుడు, పి నారాయణరావు, ఆది రాములు, కృష్ణమూర్తి, వెంకటేశ్వరరావు, రాఘవయ్య,రఘు, శంకర్రావు, దీక్షితులు, వెంకట స్వామి, హనుమంతరావు, సుబ్రహ్మణ్యం, మస్తాన్, హసన్ తదితరులు పాల్గొన్నారు.(Story : విశ్రాంత ఉద్యోగుల సేవా సంఘం ఆధ్వర్యంలో అన్నదానం.. )
