సాగు నీటి సంఘాల సమావేశానికి అమరావతికి బస్సులు ఏర్పాటు
న్యూస్ తెలుగు/వినుకొండ : వినుకొండ నియోజకవర్గానికి చెందిన సాగు నీటి సంఘాల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు కోసం అమరావతిలో నిర్వహించిన 1 రోజు సమావేశానికి రాష్ట్ర జలవనరుల శాఖ ఆధ్వర్యంలో గురువారం మూడు బస్సులు ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు “నీటి సంరక్షణ – భద్రత – భవిష్యత్తు” అనే అంశంపై సాగు నీటి సంఘాల పాత్రపై దిశానిర్దేశం చేసే సమావేశం అమరావతిలో జరిగింది. ఈ సమావేశానికి హాజరైన సాగు నీటి సంఘాల ప్రతినిధుల కోసం ఎన్ఎస్పి గ్రౌండ్ నుండి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీవి మాట్లాడుతూ. సాగునీటి నిర్వహణలో సాగు నీటి సంఘాల పాత్ర అత్యంత కీలకమని, నీటి వనరుల సంరక్షణతోనే రైతుల భవిష్యత్తు సురక్షితమవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ అధికారులు, సాగు నీటి సంఘాల సభ్యులు, కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు తరలివెళ్లారు.(Story : సాగు నీటి సంఘాల సమావేశానికి అమరావతికి బస్సులు ఏర్పాటు )
