మున్సిపల్ చైర్మన్ పదవి ద్వారా పట్టణ అభివృద్ధి
న్యూస్ తెలుగు/వనపర్తి : వనపర్తి జిల్లా పెబ్బేరు మున్సిపల్ ఎన్నికలలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ “6 స్థానాలలో” పోటీ చేస్తుందని ఆ పార్టీ 8వ కౌన్సిలర్ అభ్యర్థి గౌని బుచ్చారెడ్డి మీడియా సమావేశంలో తెలియజేశారు. ఒక్కొక స్థానంలో ఉన్న అభ్యర్థి ప్రజలపై,వారి సమస్యలపై పూర్తిగా అవగాహన ఉన్న వారినే ఎంపిక చేసినట్లు తెలిపారు. సింహం గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తే, మున్సిపల్ చైర్మన్ పదవి ద్వారా పెబ్బేరు పట్టణాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని మీడియా సమావేశంలో ప్రజలకు గౌని బుచ్చారెడ్డి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో 4వ వార్డు, 5వ వార్డు, 7వ వార్డు, 11వ వార్డు, 12 వ వార్డ్ కౌన్సిలర్ అభ్యర్థులు పాల్గొన్నారు.(Story : మున్సిపల్ చైర్మన్ పదవి ద్వారా పట్టణ అభివృద్ధి )

