చింతూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డ్రోన్ పైలెట్ ట్రైనింగ్, భూసార పరీక్ష పై శిక్షణ”కార్యక్రమం
న్యూస్ తెలుగు /చింతూరు : పీఎం – ఉష ఆర్థిక సహకారంతో ప్రభుత్వ డిగ్రీ కళాశాల, రాజమండ్రి ఏరిస్ ఆగ్రో లిమిటెడ్ సంయుక్తంగా సోమవారం డ్రోన్ పైలెట్ ట్రైనింగ్, భూసార పరీక్ష పై శిక్షణా కార్యక్రమం ప్రారంభించినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె. రత్న మాణిక్యం తెలియజేశారు. ప్రిన్సిపల్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ భూమి ఎప్పటికీ అంతుచిక్కని ఒక గోళం, అందులో ఎన్ని విచిత్రాలు దాగి ఉన్నాయో ఎవరికి అంత పూర్తిగా తెలియదు. పంటలు పండించే వారికి భూసారం గురించి మాత్రం అవగాహన ఉంటుంది. ఏ నెలలో ఏ పంట పండుతుంది, ఎప్పుడు ఏ పంట వేయలో వారికి స్పష్టమైన అవగాహన ఉంటుంది. దీనికి తోడు భూసార పరీక్షలు పూర్తిగా అందుబాటులోకి వచ్చిన తరువాత నేలలో సారం ఎంత ఉందో ఏ పంట వేస్తే మంచి దిగుబడులు వస్తాయో తెలుసుకోవడానికి ఈ భూసార పరీక్షలు ఉపయోగపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో ఏరిస్ ఆగ్రో లిమిటెడ్ నుండి విచ్చేసిన సీఈవో కె.మల్లికార్జున రావు, జోనల్ మేజర్ కె.అనిల్ కుమార్, మేనేజర్ ఎస్.అన్వేష్, ట్రైనర్స్ వినీల, దుర్గాప్రసాద్ లు మాట్లాడుతూ డ్రోన్ సాంకేతికత పై అవగాహన కలిగి ఉండి ఈ సర్టిఫికెట్ తో భవిష్యత్తులో మంచి ఉపాధి అవకాశాలు ఉంటాయని, ఇటీవల కాలంలో రైతులు పొలంలో పురుగు మందులు ఎక్కువగా వినియోగిస్తున్నారు, దీనివలన పంట నష్టపోయే అవకాశముందన్నారు.భూసార పరీక్షలు చేయుట వలన ఖచ్చితమైన దిగుబడి ఫలితాలు అందిపుచ్చుకోవచ్చునన్నారు. కళాశాల వైస్ ప్రిన్సిపల్ ఎమ్. శేఖర్ మాట్లాడుతూ ఐదు రోజుల డ్రోన్ భూసార పరీక్షల శిక్షణ కార్యక్రమంలో విద్యార్థినీ విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డా. కె. శకుంతల, జి. సాయికుమార్, ఆర్. మౌనిక, ఎన్. ఆనంద్, కె. కీర్తి, లక్ష్మి ప్రశన్న, తదితర అధ్యాపకులు విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.(Story : చింతూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డ్రోన్ పైలెట్ ట్రైనింగ్, భూసార పరీక్ష పై శిక్షణ”కార్యక్రమం )

