Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన తెలుగుదేశం చింతూరు మండల అధ్యక్షులు జెకెసి ట్రస్ట్ చైర్మన్ జమాల్...

క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన తెలుగుదేశం చింతూరు మండల అధ్యక్షులు జెకెసి ట్రస్ట్ చైర్మన్ జమాల్ ఖాన్

క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన తెలుగుదేశం చింతూరు మండల అధ్యక్షులు జెకెసి ట్రస్ట్ చైర్మన్ జమాల్ ఖాన్

న్యూస్ తెలుగు /చింతూరు : మండలంలోని కారం గూడెం గ్రామంలో సోమవారం కారం గూడెం ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ ను చింతూరు తెలుగుదేశం మండల టీడీపీ అధ్యక్షులు జమాల్ ఖాన్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రారంభించినారు. ముందుగా క్రికెట్ గ్రౌండ్ లో రిబ్బన్ కట్ చేసి జమాల్ ఖాన్ ప్రారంభించినారు. ఈ సందర్బంగా జమాల్ ఖాన్ మాట్లాడుతూ ఆదివాసీ యువకులు అన్నిరంగాల్లో నేడు ప్రతిభ కనబరుస్తున్నారని ముఖ్యoగా మన్యం లొ యువత క్రీడలపై మంచి ఆసక్తి కనబరుస్తున్నారని క్రీడలు ఆరోగ్యానికి ఎంతో దోహద పడుతాయని నేడు అనారోగ్యం తొ ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నారని ఆరోగ్యానికి మించిన ఐశ్వర్యం ప్రపంచం లో మరొకటి లేదని ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మనందరి కర్తవ్యమని ఈ సందర్భంగా అన్నారు. ఈ క్రీడలకు జమాల్ ఖాన్ తన ట్రస్టు ద్వారా 50 వేల రూపాయల మొదటి బహుమతిని ప్రకటించడం జరిగింది. ఇదే క్రమంలో అల్లిగూడెం గ్రామం లో బొరుగుంపు లొ ఒక వాలీబాల్ కిట్, పేగ గ్రామం లో ఒక క్రికెట్ కిట్, నర్సింగపేట లో వాలీబాల్ కిట్ లను క్రీడా కారులకు అందజేశారు. కార్యక్రమంలో దాసరి చిట్టిబాబు గ్రామ పెద్దలు కారం రత్తయ్య, కారం శంకరమ్మ, కారం దేసయ్య, కారం సుబ్బారావు, మడకం దేసయ్య, మార్కెట్ కమిటీ సభ్యుడు పసుపులేటి సాల్మన్ రాజు,సోడే శ్రీను,సొసైటీ అధ్యక్షుడు సరియాం చిట్టిబాబు,తదితరులు పాల్గొన్నారు.(Story : క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన తెలుగుదేశం చింతూరు మండల అధ్యక్షులు జెకెసి ట్రస్ట్ చైర్మన్ జమాల్ ఖాన్ )

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!