అజిత్ పవార్ మృతి పట్ల చీఫ్ విప్ జీవి సంతాపం
న్యూస్ తెలుగు/వినుకొండ : మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మరణ వార్త తెలిసి చాలా దిగ్భ్రాంతికి గురి చేసిందని ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు అన్నారు. మహారాష్ట్ర రాజకీయాల్లో అజిత్ పవార్ స్ఫూర్తి దాయకమైన ప్రయాణం చేశారన్నారు. మహారాష్ట్రలోని కూటమి ప్రభుత్వం ఒక రాజకీయ దురధరుడిని కోల్పోయిందన్నారు. అజిత్ పవార్, అధికారులు, పైలట్ల మృతికి ఆయన సంతాపాన్ని వ్యక్తం చేశారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థించారు. అజిత్ పవార్ కుటుంబ సభ్యులు, ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.(Story : అజిత్ పవార్ మృతి పట్ల చీఫ్ విప్ జీవి సంతాపం )
