Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌వినుకొండ నియోజకవర్గ వైయస్సార్సీపి సంస్థాగత నిర్మాణ కార్యక్రమం

వినుకొండ నియోజకవర్గ వైయస్సార్సీపి సంస్థాగత నిర్మాణ కార్యక్రమం

వినుకొండ నియోజకవర్గ వైయస్సార్సీపి సంస్థాగత నిర్మాణ కార్యక్రమం

న్యూస్ తెలుగు/వినుకొండ : వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ పిఎసి సభ్యులు, వినుకొండ మాజీ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు వినుకొండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం వైయస్సార్సీపి సంస్థాగత నిర్మాణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశంలో పెదకూరపాడు, వినుకొండ నియోజకవర్గాల పరిశీలకులు యెనుముల మురళీధర్ రెడ్డి, పల్నాడు జిల్లా వైయస్ఆర్సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు కొమ్ము చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వినుకొండ మాజీ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు, మాట్లాడుతూ. పార్టీ పదవుల్లో పార్టీకి కష్టపడి పని చేసిన వారికి తగిన గుర్తింపు ఉంటుందని, అందరూ వారికి కేటాయించిన పదవులకు వన్నె తీసుకువచ్చి జగనన్నను ముఖ్యమంత్రి ని చేయడంలో కీలకపాత్ర పోషించాలని, వారికి తగిన గుర్తింపు ప్రాధాన్యత ఎప్పుడూ ఉంటుందని అన్నారు. ప్రతి గ్రామంలో టిడిపి వల్ల ఇబ్బంది పడ్డ కార్యకర్తలు తాము పడ్డ ఇబ్బందులను డిజిటల్ బుక్ లో నమోదు చేయాలని, అధికారంలోకి వచ్చిన తర్వాత వీటన్నిటిపై తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని, కార్యకర్తలందరూ కలిసికట్టుగా పనిచేసి వైయస్ జగన్మోహన్ రెడ్డి ని తిరిగి ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలని ఈ సందర్భంగా కోరారు. అలాగే కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు దగ్గర పడుతున్నప్పటికీ, వినుకొండ పట్టణంలో ఎటువంటి అభివృద్ధి పని ఒకటి కూడా జరగలేదని ఆయన విమర్శించారు. ప్రజా ప్రతినిధులు ఇద్దరు ఉన్నప్పటికీ అభివృద్ధిపై దృష్టి పెట్టకుండా కాలయాపన చేస్తున్నారని అన్నారు. వారు వ్యక్తిగత వ్యాపారాలపై ఎక్కువ దృష్టి పెట్టి అభివృద్ధి పనులను నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జిల్లా నియోజకవర్గ పట్టణ, మండల, గ్రామ, వార్డు పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.(Story : వినుకొండ నియోజకవర్గ వైయస్సార్సీపి సంస్థాగత నిర్మాణ కార్యక్రమం )

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!