ఘనంగా చింతూరు ఐటిడిఎ లో గణతంత్ర దినోత్సవం
న్యూస్ తెలుగు /చింతూరు : భారతదేశ 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని, ఐటిడిఎ చింతూరు ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించినట్లు ప్రాజెక్ట్ ఆఫీసర్ శుభమ్ నొక్వాల్ తెలిపారు.ఈ సందర్భంగా భారత రాజ్యాంగం ప్రతిపాదించిన స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం, న్యాయం వంటి విలువలను ప్రతి పౌరుడు తన దైనందిన జీవితంలో ఆచరణలో పెట్టాలని ప్రాజెక్ట్ ఆఫీసర్ పిలుపునిచ్చారు. అలాగే గిరిజన ప్రాంతాల సమగ్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందే విధంగా ఐటిడిఎ చింతూరు నిరంతరం కృషి చేస్తోందని పేర్కొన్నారు.పోలవరం ప్రాజెక్టు కారణంగా నష్టపోతున్న నిర్వాసితులకు వీలైనంత త్వరగా ఆర్ & ఆర్ ప్యాకేజీ, ఆర్ & ఆర్ కాలనీల నిర్మాణం, భూ నష్ట పరిహారం, అలాగే గిరిజనులకు భూమికి భూమి వంటి ప్రయోజనాలు అందించే విధంగా అవసరమైన చర్యలు చేపడతామని ఈ సందర్భంగా తెలిపారు.గిరిజనుల విద్య, ఆరోగ్యం, ఉపాధి అవకాశాలు, మౌలిక వసతుల అభివృద్ధి దిశగా ఐటిడిఎ చింతూరు నిరంతరం కృషి చేస్తోందని పేర్కొంటూ, ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఐటీడీఏ ఏపీవో రామ తులసి , ఐటిడిఎ డి ఈ మురళి డిప్యూటీ డి ఎం అండ్ హెచ్ ఓ పుల్లయ్య , జిసిసి మేనేజర్ సుబ్రమణ్యం ,యస్ ఐ రమేష్ తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.(Story : ఘనంగా చింతూరు ఐటిడిఎ లో గణతంత్ర దినోత్సవం )

