మొదటి సారిగా ఉత్తమ అవార్డు పొందిన చింతూరు ఇద్దరు మండల ఎంఈఓ లు
న్యూస్ తెలుగు /చింతూరు : కొత్తగా ఏర్పడిన పోలవరం జిల్లా( రంపచోడవరం )లోని చింతూరు మండలంలో పనిచేస్తున్న మండల విద్యాశాఖ అధికారులు మొదటి సారిగా అవార్డు పొందారు. చింతూరు మండలంలో పనిచేస్తున్న వివి లక్ష్మీనారాయణ, జి వెంకటేశ్వర్లు, ఇద్దరికీ ఒకేసారి రిపబ్లిక్ డే సందర్భంగా కలెక్టర్ చేతుల మీదుగా ఉత్తమ మండల విద్యాశాఖ అధికారి అవార్డు రావడం విశేషం, ఇప్పటివరకు ఏ మండలంలో ఈ విధమైన అవార్డ్స్ అందుకోలేదు. మొదటిసారిగా చింతూరు మండలంలోని ఇద్దరు ఎంఈఓ లను ఉత్తమ ఎంఈఓ గా ఎంపిక చేయడం విశేషం. ఇద్దరు మండల విద్యాశాఖ అధికారులకు ఉత్తమ అవార్డులు పొందటం పట్ల విద్యాశాఖ ఉపాధ్యాయులు ఆనందం వ్యక్తం చేశారు. ఎంఈఓ లకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ విషయమై ఎంఈఓలతో మాట్లాడగా ఈ అవార్డు స్ఫూర్తిగా తీసుకొని మండలాన్ని ఇంకా ముందుకు తీసుకువెళ్లడానికి ప్రయత్నిస్తామని తెలిపారు.(Story : మొదటి సారిగా ఉత్తమ అవార్డు పొందిన చింతూరు ఇద్దరు మండల ఎంఈఓ లు )

