Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ గీతాంజలి స్కూల్స్ నందు బాలలత మేడం మోటివేషనల్ ప్రోగ్రాం..

గీతాంజలి స్కూల్స్ నందు బాలలత మేడం మోటివేషనల్ ప్రోగ్రాం..

0

గీతాంజలి స్కూల్స్ నందు బాలలత మేడం మోటివేషనల్ ప్రోగ్రాం..

న్యూస్ తెలుగు/వినుకొండ : స్థానిక గీతాంజలి స్కూల్స్ నందు ప్రముఖ ఐఏఎస్ కోచింగ్ అధినేత బాలలత మేడం చే మోటివేషనల్ ప్రోగ్రాం ను 9, 10 తరగతి విద్యార్థుల కొరకు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాలలత మేడం ముఖ్యఅతిథిగా విచ్చేసి చిన్నారులకు మోటివేషన్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిన్నారులను ఉద్దేశించి మాట్లాడుతూ. తాను చిన్నతనం నుంచి విద్యను ఆయుధంగా మలుచుకొని పోలియో వలన తన రెండు కాళ్లు పడిపోయిన, జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకున్నానని, రెండు పర్యాయాలు ఐఏఎస్ పరీక్షలు ఉత్తీర్ణురాలై, కేవలం ఉద్యోగం ద్వారా 30 సంవత్సరాలు మాత్రమే సేవ చేయగలనని, అదే ఈ 30 సంవత్సరాలు చిన్నారు లను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దినట్లయితే దేశానికి ఎంతో సేవ చేయగలనని తలచి ఐఏఎస్ పదవికి రాజీనామా చేసి చిన్నారులు భవిష్యత్తు కోసం ఐఏఎస్ అకాడమీను స్థాపించి,ఎంతోమంది ఐఏఎస్ లను దేశానికి అందించానని, కావున చిన్నారులందరూ చక్కగా విద్యలో రాణించి భావి భారత పౌరులుగా ఎదగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా లాయిడ్ గ్రూప్ వారు నిర్వహిస్తున్న ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నందు డైరెక్టర్గా పనిచేస్తూ ఎంతోమంది చిన్నారులకు మార్గ నిర్దేశం చేస్తున్నానని చెప్పారు. అలాగే చిన్నారులు తమ తల్లిదండ్రులకు తమ గురువులకు మంచి పేరు తీసుకుని రావాలని పిలుపునిచ్చారు. ఎన్ని అవరోధాలు ఎదురైన వెనకకు తిరగకుండా ముందుకు సాగుతూ మంచి లక్ష్యాలను ఏర్పరుచుకోవాలని పిలుపునిచ్చారు. అంగవైకల్యం ఉన్నప్పటికీ తాను ఈ స్థాయికి చేరుకోవడానికి కటోర శ్రమ మరియు పట్టుదల మాత్రమేనని, కాబట్టి చిన్నారులు చక్కగా శ్రమించి విద్యలు రాణించాలని పిలుపునిచ్చారు. శ్రమ నీ ఆయుధమైతే విజయం నీ బానిస అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ చక్కగా విద్యులు రాణించాలని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ధనిక్ భరత్ విద్యా సంస్థల డైరెక్టర్ అజయ్ విక్రమ్, కందిమళ్ళ సాంబశివరావు, శవిరి రాజు, గీతాంజలి విద్యాసంస్థల కరెస్పాండెంట్ యెండ్లూరి కిషోర్, ప్రిన్సిపల్ కృష్ణవేణి, పలు విద్యాసంస్థల డైరెక్టర్లు, విద్యార్థులు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు.(Story : గీతాంజలి స్కూల్స్ నందు బాలలత మేడం మోటివేషనల్ ప్రోగ్రాం.. )

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version