రక్తదానంలో వినుకొండ స్టేట్ ఫస్ట్..
న్యూస్ తెలుగు / వినుకొండ : టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మాత్యులు నారా లోకేష్ 43వ జన్మదిన వేడుకలు సందర్భంగా వినుకొండ చీఫ్ విప్ కార్యాలయంలో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో “లెజెండరీ బ్లడ్ డొనేషన్ డ్రైవ్” రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. చీఫ్ విప్ జివి ఆంజనేయులు పిలుపుమేరకు వినుకొండ నియోజకవర్గంలోని యువత పెద్ద సంఖ్యలో శిబిరానికి తరలివచ్చి రక్తదానం చేశారు. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగిన శిబిరంలో 540 మంది యువకులు రక్తదానం చేయటం చేయటంతో వినుకొండ రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచింది. లోకేష్ పుట్టినరోజు సందర్భంగా తన పిలుపు అందుకొని రక్తదానం చేసిన యువతకు చీఫ్ విప్ జీవి ఆంజనేయులు అభినందనలు తెలిపారు. (Story:రక్తదానంలో వినుకొండ స్టేట్ ఫస్ట్..)

