Homeవార్తలుతెలంగాణమున్సిపల్ ఎన్నికలు నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించడంలో రిటర్నింగ్ అఫీసర్లదే కీలక పాత్ర

మున్సిపల్ ఎన్నికలు నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించడంలో రిటర్నింగ్ అఫీసర్లదే కీలక పాత్ర

మున్సిపల్ ఎన్నికలు నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించడంలో రిటర్నింగ్ అఫీసర్లదే కీలక పాత్ర

న్యూస్‌తెలుగు/వనపర్తి : త్వరలో జరుగబోయే పురపాలక ఎన్నికలు సజావుగా నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించడంలో రిటర్నింగ్ అధికారి కీలక పాత్ర పోషించాల్సి ఉంటుందని జిల్లా కలక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. అందుకే ప్రతి రిటర్నింగ్ అధికారి ఎన్నికల నిబంధనలు క్షుణ్ణంగా అర్థం చేసుకొని ఏమైనా అనుమానాలు ఉంటే ఇక్కడే నివృత్తి చేసుకోవాలని ఆదేశించారు. శుక్రవారం ఐ.డి.ఒ.సి సమావేశ మందిరంలో మాష్టర్ ట్రైనర్ ద్వారా రిటర్నింగ్ ఆఫీసర్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ వివరిస్తూ మున్సిపల్ ఎన్నికలు రాజకీయ పార్టీల గుర్తుతో ఉంటాయని, రిటర్నింగ్ అధికారులు చాలా జాగ్రత్తగా తమ విధులు నిర్వహించాల్సి ఉంటుందన్నారు. నామినేషన్ ప్రక్రియలో చాలా అనుమానాలు వస్తుంటాయని, అభ్యర్థులకు గుర్తులు ఏవిధంగా కేటాయించాలి, క్రమ సంఖ్య ఎలా ఉండాలి వంటి అనుమానాలు వస్తాయి అనుమానంతో తప్పులు చేయకుండా నిబంధనల పై పూర్తి అవగాహన కలిగి ఉండాలని రిటర్నింగ్ ఆఫీసర్లకు వివరించారు. అనేక ఉదాహరణలతో కలెక్టర్ రిటర్నింగ్ అధికారులకు అవగాహన కల్పించారు. నామినేషన్ వేసేందుకు వచ్చిన ప్రతి పోటీ దారుకి ఎన్నికల్లో పోటీ చేసే విధంగా అవకాశం కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. నామినేషన్ వేసేందుకు వచ్చిన అభ్యర్థి తో పాటు ప్రతిపాదకుడు, మరో వ్యక్తి కలిపి ముగ్గురిని రిటర్నింగ్ అధికారి గదిలో అనుమతించాలని సూచించారు. నామినేషన్ సరిగ్గా ఇచ్చెవిధంగా అవగాహన కల్పించాలని నామినేషన్ పత్రంలో ఏమైనా తప్పులు, లోపాలు ఉంటే పరిశీలించి నోటీస్ ఇవ్వాలని సూచించారు. జనరల్ కేటగిరీ వారు పోటీ చేసేందుకు 2500లు ఎస్సి, ఎస్టీ అభ్యర్థులకు 50 శాతం రాయితీ ఉంటుందన్నారు. పోటీ చేసే అభ్యర్థుల పేర్లు సంబంధిత మున్సిపాలిటీ ఓటరు జాబితాలో ఉండాలని అన్నారు. నామినేషన్ పత్రాలు స్వీకరించే రోజు నుంచి స్కృటిని , వితడ్రా, గుర్తులు కేటాయింపు వరకు ప్రతి చోట రిటర్నింగ్ అధికారి తీసుకోవాల్సిన బాధ్యతలు, ఎన్నికల నిబంధనల పై అవగాహన కల్పించారు. అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ యాదయ్య, వనపర్తి మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, ఆత్మకూరు, అమర్చింత, కొత్తకోట, పెబ్బేరు మున్సిపల్ కమిషనర్లు, శిక్షణ నోడల్ అధికారి రామ మహేశ్వర్ రెడ్డి, ట్రైనర్ శ్రీనివాసులు, రిటర్నింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. (Story:మున్సిపల్ ఎన్నికలు నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించడంలో రిటర్నింగ్ అఫీసర్లదే కీలక పాత్ర)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments